ఆంధ్రప్రదేశ్‌

370 రద్దు చారిత్రాత్మకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 24: భారతదేశానికి పట్టిన 370 ఆర్టికల్ రాచపుండును అధికారంలోకి వచ్చిన 70 రోజుల్లో, 72 గంటల్లో తొలగించిన సమర్థవంతమైన నాయకుడు ప్రధాని మోదీ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ అన్నారు. 370 ఆర్టికల్‌పై వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు దేశ వ్యాప్తంగా 370 ప్రదేశాల్లో చేపట్టిన అవగాహన కార్యక్రమంలో భాగంగా తిరుపతిలోని ఎస్వీయూ శ్రీనివాస ఆడిటోరియంలో శనివారం తొలి సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా రామ్‌మాధవ్ మాట్లాడుతూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ 370వ ఆర్టికల్ భారతదేశం నెత్తిన కుంపటిలా మారిందన్నారు. దీనివల్ల ఉగ్రవాదం వెర్రితలలు వేసిందని, భారత్‌కు పక్కలో బల్లెంలా పాక్ మారిందన్నారు. ఈ ఆర్టికల్ గురించి మాట్లాడే వారిలో సగం మంది నేతలకు దీని గురించి పూర్తిగా తెలియదని, వారికి తెలిసిందంతా 420 గురించేనన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో 30 సంవత్సరాల్లో 45వేల మంది కాశ్మీరులు, 8వేల మంది సైనికులు తమ ప్రాణాలను కోల్పోయారని అన్నారు. 370 ఆర్టికల్ రద్దుతో ఉపద్రవాలు వస్తాయని, భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కొందరు నాయకులు అదేపనిగా ప్రచారం చేశారన్నారు. ఈ ఆర్టికల్ కారణంగా కాశ్మీర్‌లోని ఎస్టీలు తమ ఓటుహక్కును కోల్పోయారని, రాజకీయంగా అణచివేతకు గురయ్యారని అన్నారు. 1953 తరువాత అక్కడ ఒక్క ఫ్యాక్టరీ కూడా రాలేదన్నారు. చదువుకోవాలన్నా, ఉద్యోగాలు పొందాలన్నా స్థానికులకు 370 ఆర్టికల్ అడ్డుగా నిలిచిందని రామ్‌మాధవ్ తెలిపారు. జమ్మూ- కాశ్మీర్‌కు 370 ఆర్టికల్‌తో ప్రత్యేక హోదా కల్పించడాన్ని ఆనాడు సీడబ్ల్యుసీలో గోపాలస్వామి అయ్యర్, వౌలానా అబుల్‌కలాం తప్ప ఇంకెవ్వరూ సమర్థించ లేదన్నారు. ఈ ఆర్టికల్‌ను రాజ్యాంగంలోకి దొడ్డిదారిన తీసుకువచ్చి చేర్చారని ఆయన మండిపడ్డారు. ఎన్నికల్లో ఓడిపోయినవారు నేడు దక్షిణ భారతదేశాన్ని ప్రత్యేక దేశం చేయాలన్న నినాదాన్ని ముందుకు తెచ్చారని అయితే కేంద్రంలో ప్రధాని మోదీ ఉన్నారన్న విషయం మరచిపోతున్నారని ఆయన అన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఆర్టికల్ 370 ఈ దేశానికి నెత్తిమీద కుంపటిలా మారిందన్నారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించిన తరువాత సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం వీసీ ఆచార్య మురళీధర శర్మ మాట్లాడుతూ నేడు ఆర్టికల్ 370 రాక్షసిని ప్రధాని నరేంద్రమోదీ అంతం చేశారన్నారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్‌నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆరెస్సెస్ సంఘ చాలక్ సుందరమూర్తి, ఎస్వీయూ రిజిస్ట్రార్ శ్రీ్ధర్‌రెడ్డి, బీజేవైఎం నాయకులు కల్లూరు విష్ణువర్థన్‌రెడ్డి, శ్రీకాంత్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఎస్వీయూ, శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం విద్యార్థులు పాల్గొన్నారు.
చిత్రాలు.. ఆర్టికల్ 370పై బీజేపీ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహించిన సదస్సులో పాల్గొన్న జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. హాజరైన పార్టీ నాయకులు, విద్యార్థులు