ఆంధ్రప్రదేశ్‌

వైద్యశాఖలో విప్లవాత్మక మార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 24: వైద్య, ఆరోగ్య శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నామని, పేదవాడికి వెయ్యి రూపాయలు దాటిన ప్రతీ వైద్యానికి ఉచితంగా సేవలందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయని కేజీహెచ్‌లో రోగులకు అందుతున్న వైద్య సేవలను శనివారం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణీ, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌తో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా కేజీహెచ్‌లోని కార్డియాలజీ, పిల్లల వార్డు, జనరల్, రేడియాలజీ వార్డులను తనిఖీ చేసి రోగులకు అందుతున్న సేవలపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేజీహెచ్ సూపరింటెండెంట్, ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖాధికారులతో కలసి ఆసుపత్రి అభివృద్ధి, వౌలిక వసతుల కల్పన, పెండింగ్ సమస్యలపై సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ ఆరోగ్యశాఖకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.12 వేల కోట్లు కేటాయించిందని, ఆ నిధులతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వసతులు, పరికరాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. ప్రతీ మండలానికి ఒక్కో 104, 108 వాహనాలు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే వాహనాలకు సంబంధించి టెండర్లు పిలిచామన్నారు. రాష్ట్రంలోనే హైరిస్క్ జిల్లా ఉన్న విశాఖ కేజీహెచ్‌లో ప్రస్తుతం అందుతున్న వైద్యసేవలను మరింత మెరుగ్గా అందించాలన్నారు. గిరిజన ప్రాంతం నుంచి వైద్యం కోసం వచ్చే గిరిజనులకు సరైన సమయంలో స్పందించి సేవ చేయాలన్నారు.
నిమ్స్ తరహాలో విమ్స్ అభివృద్ధి
విశాఖలో ఎంతో ప్రతిష్టాత్మాకంగా సేవలందిస్తున్న విమ్స్ ఆసుపత్రిని నిమ్స్ తరహాలో అభివృద్ధి చేసేందుకు రూ.100 కోట్ల నిధులు కేటాయించనున్నామని, త్వరలోనే విమ్స్‌లో పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి ఆళ్ల నాని అన్నారు. విమ్స్ అభివృద్ధి చెందితేనే కేజీహెచ్‌పై వత్తిడి తగ్గుతుందని, ఈ నేపథ్యంలో అవసరమైన సిబ్బందిని తక్షణమే నియమిస్తామన్నారు.
గిరిజన ప్రాంత రోగులకు
తొలి ప్రాధాన్యం
ఇవ్వండి: మంత్రి పుష్పశ్రీవాణి
ఉత్తరాంధ్ర జిల్లాలో అధిక శాతం గిరిజనులు వైద్యం కోసం కేజీహెచ్‌కు వస్తారని, వారికి తొలి ప్రాధాన్యతనివ్వాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణీ అన్నారు. ఉత్తరాంధ్రలోని మూడు ఐటీడీ ఏలకు కొత్తగా మూడు మహాప్రస్థాన వాహనాలను త్వరలోనే మంజూరు చేయనున్నామన్నారు.
‘కేజీహెచ్ అభివృద్ధికి ప్రతిపాదనలు పంపండి’
కింగ్‌జార్జి ఆసుపత్రిని దేశంలోనే ప్రతిష్టాత్మకమైన వైద్యశాలగా మార్చేందుకు పూర్తిస్థాయిలో ప్రతిపాదనలు పంపితే వాటిని పరిశీలించి నిధులు మంజూరు చేస్తామని ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కె ఎస్ జవహర్‌రెడ్డి అన్నారు. వైద్య విద్యార్థులకు వసతి,ప్రసూతి వార్డు అభివృద్ధి చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. నాల్గొవ తరగతి ఉద్యోగులు, నర్సింగ్ సిబ్బంది కొరతపై సీఎంతో చర్చించి త్వరలోనే పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు.

చిత్రం...విశాఖలోని కేజీహెచ్‌లో గైనిక్ వార్డులో గిరిజన రోగులతో ఆరోగ్య సేవలపై ఆరా తీస్తున్న మంత్రులు ఆళ్ల నాని, పుష్పశ్రీవాణీ, అవంతి శ్రీనివాస్