ఆంధ్రప్రదేశ్‌

మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్ల ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 25: రాష్ట్రంలో షెడ్యూల్ కులాల అభ్యున్నతికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా మూడు కార్పొరేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఏపీ మాల సంక్షేమ కార్పొరేషన్, ఏపీ స్టేట్ మాదిగ సంక్షేమ కార్పొరేషన్, ఏపీ రెల్లి, ఇతరుల సంక్షేమ కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మూడు కార్పొరేషన్లకు సంబంధించి అధికార, అనధికార సభ్యులతో కమిటీ ఏర్పాటుకు విధివిధానాలు ఖరారు చేయాలని ఏపీ ఎస్సీ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీకి ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.
జీఎస్టీ వర్తింపుపై అధ్యయనానికి కమిటీ
రాష్ట్రంలో ప్రపంచ బ్యాంక్ నిధులతో ఏపీ డిజాస్టర్ రికవరీ ప్రాజెక్టు కింద చేపడుతున్న పనులకు సంబంధించి జీఎస్టీ వర్తింపుపై అధ్యయనం చేసేందుకు వీలుగా ఒక కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఏపీఈపీడీసీఎల్ డైరెక్టర్ (ప్రాజెక్ట్సు) చైర్మన్‌గా వ్యవహరించే కమిటీలో మరో నలుగురు సభ్యులు ఉంటారు.