ఆంధ్రప్రదేశ్‌

శభాష్ సింధూ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 25: పీవీ సింధు అసలు సిసలైన ఛాంపియన్‌లా ఆడారంటూ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకు ఆధిపత్యం చూపారని ప్రశంసించారు. ఏ ఇతర భారత షట్లర్‌కు సాధ్యంకాని రీతిలో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ టైటిల్ నెగ్గడం పట్ల ప్రశంసల వర్షం కురిపించారు. చారిత్రాత్మక విజయమంటూ సింధును ఆయన అభినందించారు.
గవర్నర్ అభినందనలు
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ టైటిల్ కైవసం చేసుకున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధును రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. అనితర సాధ్యమైన విజయాన్ని నమోదు చేసుకున్న సింధు భారతీయుల క్రీడాప్రతిభను ప్రపంచానికి చాటారన్నారు. ప్రపంచ శ్రేణి క్రీడాకారిణిని ఈ దేశానికి అందించిన ఘనత ఆంధ్రప్రదేశ్‌ది కావటం శుభపరిణామమన్నారు. నేటి యువత ఈ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలన్న ఆకాంక్ష వెలిబుచ్చారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో జపాన్ క్రీడాకారిణి ఒకుహరాపై 21-7, 21-7 తేడాతో సింధు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
చంద్రబాబు శుభాకాంక్షలు
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పసిడి పతకం సాధించిన పీవీ సింధుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అభినందలు తెలిపారు. అద్భుతమైన ఆటతీరు, అసాధారణ ప్రతిభతో అనుకున్న లక్ష్యం సాధించి మనదేశ కీర్తిని, గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా మరోసారి ఇనుమడింప చేసిందని ప్రశంసించారు. ఆమెను అన్నివిధాలా ప్రోత్సహించిన తల్లిదండ్రులు, కోచ్ గోపిచంద్‌కు బాబు అభినందనలు తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సింధుకు గ్రూప్-1 ఉద్యోగమిచ్చి గౌరవించామని గుర్తుచేశారు. సింధు భవిష్యత్‌లో మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు. పీవీ సింధుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఆమె సాధించిన విజయం తెలుగువారికి, దేశ ప్రజలందరికీ గర్వకారణమన్నారు. యువత సింధును స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్‌లో ఉన్నత స్థాయికి ఎదగాలనే ఆకాంక్షను లోకేష్ వ్యక్తపరిచారు.