ఆంధ్రప్రదేశ్‌

అంగన్‌వాడీ కేంద్రాల్లో మహిళా-శిశు సంజీవని మిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మార్చి 24: మాతా-శిశు ఆరోగ్య పరిరక్షణ కోసం, పౌష్టికాహారాన్ని అందించడానికి మహిళా-శిశు సంజీవని మిషన్ పేరుతో వినూత్న పథకాన్ని తూర్పు గోదావరి జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం ప్రయోగాత్మకంగా అమలుచేస్తోంది. ఏజన్సీ, మారుమూల గ్రామాల్లో మాతా-శిశు ఆరోగ్య పరిరక్షణ కోసం పౌష్టికాహారాన్ని అందించడానికి ఉద్దేశించిన ఈ పథకాన్ని ప్రభుత్వ యంత్రాంగం-యునిసెఫ్ సంయుక్తంగా అమలుచేస్తున్నాయి. జిల్లాలోని గిరిజన, మారుమూల ప్రాంతాలలో పేద వర్గాలు పౌష్టికాహార సమస్యను ఎదుర్కొంటున్నారు. చిన్నారుల సంక్షేమానికి ఒక చిహ్నంగా భావిస్తోన్న ఈ మహిళా-శిశు సంజీవని మిషన్ ద్వారా మేలైన ఆహార పోషక పదార్ధాలను అందిస్తారు. ఇప్పటికే ఆయా అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నప్పటికీ, పౌష్టికాహార లోపాన్ని పూర్తిగా నివారించి, శిశు మరణాలను నివారించేందుకు కొత్తగా ఈ మహిళా-శిశు సంజీవని మిషన్‌ను అమలుచేస్తున్నారు. ఇందుకు తూర్పు గోదావరి జిల్లాలో 50 అంగన్‌వాడీ కేంద్రాలను ఎంపిక చేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దేశంలో చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ కోసం యునిసెఫ్ సహకారంతో ఈ మహిళా-శిశు సంజీవని మిషన్‌ను అమలుచేస్తున్నారు.
ప్రపంచంలోనే అతి పెద్ద మహిళా శిశు సంరక్షణ కోసం అమలుచేస్తున్న ఆరోగ్య కార్యక్రమంగా ఈ పథకాన్ని పేర్కొంటున్నారు. జిల్లాలో ప్రస్తుతం 50 అంగన్‌వాడీ కేంద్రాల్లో పైలెట్ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని అమలుచేస్తున్నారు. జిల్లాలో 26 అంగన్‌వాడీ ప్రాజెక్టులు ఉండగా ఆయా ప్రాజెక్టుల పరిధిలో ఎంపిక చేసిన 50 అంగన్‌వాడీ కేంద్రాలలో మహిళా-శిశు సంజీవని మిషన్ కార్యకలాపాలు ప్రారంభమైనట్టు అధికారులు పేర్కొన్నారు. ఆరేళ్ల లోపు చిన్నారుల్లో ఆరోగ్యం, పౌష్టికాహార లోపాన్ని నివారించడానికి ఈ పథకం ఉపయోగపడుతుందన్నారు. శిశు మరణాల సంఖ్యను తగ్గించడం ముఖ్య ఉద్దేశ్యంగా పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా యునిసెఫ్ సహాయంతో అమలుజరుగుతున్న ఈ పథకాన్ని జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖ పర్యవేక్షిస్తోంది.