రాష్ట్రీయం

రూ. 30 కోట్లతో అలిపిరి నడక మార్గం ఆధునీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 1: తిరుపతి నుండి తిరుమలకు భక్తులు నడిచివెళ్లే అలిపిరి మార్గాన్ని ఆధునీకరించేందుకు టీటీడీ యాజమాన్యం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందుకు 30 కోట్ల రూపాయల మేర ప్రణాళికలను సిద్ధం చేసింది. దీనికి అయ్యే వ్యయభారాన్ని రిలయన్స్ సంస్థ ఇవ్వడానికి ఆ సంస్థ ప్రతినిధి ప్రసాద్ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. ఏదిఏమైనా సుమారు 10 కిలోమీటర్ల పైమేర దూరం ఉన్న కాలిమార్గానికి ఇంత పెద్దఎత్తున వ్యయం చేయడం ఇదే ప్రథమమని తెలుస్తోంది. అయితే ఈ ప్రణాళిక కార్యాచరణ జరిగితే భక్తులు మరింత ఆహ్లాదకర, ఆధ్యాత్మికమైన వాతావరణంలో కాలినడకన తిరుమలకు వెళ్లనున్నారు. ఈ మార్గంలో ఎలాంటి వైద్య సౌకర్యాలు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేస్తారన్న అంశంపై మాత్రం టీటీడీ అధికారులు బహిర్గతం చేయలేదు.