ఆంధ్రప్రదేశ్‌

చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఆచార్య యర్లగడ్డ లక్ష్మీప్రసాద్ చేసిన కృషి ఫలించి మైసూరులో ఉన్న ప్రాచీన తెలుగు భాష ప్రాంతీయ అధ్యయన కేంద్రం నెల్లూరుకు వస్తోంది. నెల్లూరులోని ఎన్‌సీఈఆర్‌టీ క్యాంపస్‌లో అధ్యయన కేంద్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని కేంద్ర మానవ వనరుల శాఖలోని భాషా విభాగం ఆదేశాలు జారీ చేసింది. హెచ్‌ఆర్‌డీలోని భాషా విభాగం డిప్యూటీ కార్యదర్శి సుమన్ దీక్షిత్ ఈ మేరకు మైసూరులోని భారత భాషల కేంద్ర సంస్థ (సీఐఐఎల్) డైరెక్టర్‌కు లేఖ రాశారు. ప్రస్తుతం సీఐఐఎల్‌లో నడుస్తున్న ప్రాచీన తెలుగు భాషా అధ్యయన కేంద్రాన్ని వెంటనే నెల్లూరులోని ఎన్‌సీఈఆర్‌టీ ప్రాంగణానికి తరలించాలని గతనెల 29న రాసిన లేఖలో ఆదేశించారు. మైసూరులోని దక్షిణ భారత భాషల అధ్యయన కేంద్రాన్ని మైసూరులో ఏర్పాటు చేసిన అనంతరం ఆయా రాష్ట్రాలు తమ భాషల అధ్యయన కేంద్రాలను తమ రాష్ట్రాలకు తీసుకుపోయాయి. అయితే అవిభాజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు చొరవ చూపించకపోవడంతో ప్రాచీన తెలుగు భాషా అధ్యయన కేంద్రం మైసూరులోనే ఉండిపోయింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తనను ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడుగా నియమించగానే యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ దీనిపై దృష్టిసారించారు. ప్రాచీన తెలుగు భాషా అధ్యయన కేంద్రాన్ని మైసూరు నుంచి తెలుగు రాష్ట్రాలకు తరలించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ ప్రయత్నాల్లో భాగంగానే ఆయన ఆగస్టు 25న ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడుకు ఒక లేఖ రాశారు. వెంకయ్యనాయుడు దీనిపై స్పందిస్తూ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోక్రియాల్‌తో ఈమేరకు చర్చించి కేంద్రం తరలింపునకు మార్గం సుగమం చేశారు. హెచ్‌ఆర్‌డీ మంత్రి రమేష్ పోక్రియాల్ ఆదేశం మేరకే ఆయన శాఖలోని భాషా విభాగం కదిలింది. విభాగం డిప్యూటీ కార్యదర్శి సుమన్ దీక్షిత్ సీఐఐఎల్ డైరెక్టర్‌కు రాసిన లేఖలో మైసూర్‌లో ఉన్న ప్రాచీన తెలగు భాషా అధ్యయన కేంద్రాన్ని నెల్లూరులోని ఎన్‌సీఆర్‌టీ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు.