ఆంధ్రప్రదేశ్‌

ఈ విజయం మీదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 24:‘‘కృష్ణా పుష్కరాల విజయవంతంలో నా జీవితంలో ముందెన్నడూ లేని సంతోషం, ఆనందం చోటు చేసుకుంది. నాలోనే కాదు పుష్కర విధులు నిర్వర్తించిన ప్రతి ఒక్కరి ముఖారవిందాల్లోనూ కన్పిస్తోంది. ఈ కిక్ ఇలానే నిరంతరం కొనసాగిస్తూ రాష్ట్భ్రావృద్ధి కోసం పాటుబడాలి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘‘నేను టీంలీడర్‌ను మాత్రమే... అధికారులు, ఉద్యోగులందరూ అంకిత భావంతో పనిచేయబట్టే పుష్కర స్నానం చేసిన ప్రతి ఒక్కరి హృదయంలో అందరం శాశ్వతంగా నిలువగల్గామన్నారు. గత 13 రోజులుగా నిద్రాహారాలు లేకుండా... కుటుంబ సభ్యులకు దూరంగా విధులు నిర్వర్తించినందున ఒక రోజు తమ కుటుంబ సభ్యులతో గడుపుకోటానికి పుష్కర విధులు నిర్వర్తించిన వారందరికీ శుక్రవారం (26వ తేదీ) ప్రత్యేక సెలవు ఇస్తున్నా’నంటూ హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.
పుష్కరాల విజయవంతంలో రాష్ట్ర రాజధాని ప్రతిష్ఠ బాగా పెరిగిందంటూ తబ్బిబయ్యారు. గోదావరి పుష్కరాల కంటే కూడా ఈ కృష్ణా పుష్కరాలలో కులమత, ప్రాంతాలకు అతీతంగా ప్రజలు పుష్కర స్నానమాచరించారన్నారు.
కృష్ణా, కర్నూలు, గుంటూరు జిల్లాలో పుష్కర విధులు నిర్వర్తించిన అధికారులు సిబ్బంది అభినందన సభ బుధవారం స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైభవోపేతంగా జరిగింది. సిఎం చంద్రబాబు స్వయంగా వందలాది అధికారులు సిబ్బందికి జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందచేసారు. ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమానికి రెండు గంటల సమయం పట్టింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కృష్ణా పుష్కరాలలో తాము చాలా నేర్చుకున్నామని, విజయం సిద్ధించిన ఉత్సాహంలో అందరిని అభినందించడం సంతోషంగా ఉందని అన్నారు. ఉద్యోగస్తులు పుష్కరాలలో వినూత్నంగా యాత్రికులకు అందించిన సేవలు అన్నింటిని డాక్యుమెంటేషన్ రూపొందిస్తున్నామన్నారు. పుష్కర విధులలో వివిధ కారణాల వల్ల మరణించిన ఉద్యోగులకు అదనంగా రూ.10 లక్షలు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు రూ.5 లక్షలు ప్రకటించారు. పుష్కరాలు విజయవంతం చేయటంలో ముఖ్యమంత్రి కృషికి ఉద్యోగులందరూ నిలబడి ఒక నిమిషం పాటు సంఘీభావం తెలియజేశారు. పత్రికల వాళ్లు కూడా బాగా రాశారని, మీడియా వాళ్లు బాగా చూపించారంటూ ప్రశంసించారు.
కృష్ణా పుష్కరాల స్పెషల్ ఆఫీసర్ బి.రాజశేఖర్ అధికారులందరిని బాగా సమన్వయం చేశారని చెప్పారు. డిజిపి నండూరి సాంబశివరావు అతి తక్కువ సమయంలో పోలీసుల ఇమేజ్ మార్చేశారని, ఫ్రెండ్లీ పోలీసులుగా పుష్కర యాత్రికులకు సాయం అందించారని చెప్పారు. పోలీసుల సేవా కార్యక్రమాలు ప్రజల దృష్టిని ఆకర్షించాయన్నారు.
పుష్కరాలతో విజయవాడ, రాష్ట్ర రాజధాని ప్రతిష్ఠ బాగా పెరిగిందని, నగరంలో మొన్నటివరకు అపరిశుభ్రమైన రోడ్లు, కాలువల పక్కన ఆక్రమణలతో ఇరుకుఇరుకుగా చెత్తతో నిండి వుండేదని పుష్కరాలలో మున్సిపాలిటీ వాళ్లు తీసుకున్న చర్యలతో నగరం పరిశుభ్రంగా మారిందన్నారు.
పుష్కరాలలో మెజారిటీ యువత వచ్చారని, స్నానఘట్టాలలో సెల్ఫీలు దిగి సంతోషంగా గడిపినట్లు చెప్పారు. విద్యార్థులు వాల్ పేయింట్స్ వేశారని, ఇందులో 18 వేల మంది స్కూలు విద్యార్థులు, కాలేజీ విద్యార్థులు బాగా పనిచేశారని రాత్రి 10 గంటల తర్వాత కూడా వాళ్లు పనిచేయడం చెప్పుకోదగ్గ విషయమని చంద్రబాబు అన్నారు. నగరంలో యాత్రికులకు అన్నదానం చేయడంలో 300 స్వచ్ఛంద సంస్థలు, పుట్టపర్తి ట్రస్ట్, అక్షయపాత్ర, టిటిడి వంటి సంస్థలు తోడ్పాటు అందించాయన్నారు.
పుష్కరాలలో ఆదునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంత ఉపయోగించాలో అంత ఉపయోగించగలిగామన్నారు. కృష్ణా పుష్కరాల్లో ఫిన్స్ ద్వారా, డిఎన్‌ఎ టెక్నాలజీ ఉపయోగించటం ద్వారా నేరస్థులను అదుపు చేయగలిగామన్నారు. భవిష్యత్తులో ఈ టెక్నాలజీ ద్వారా మాస్ కాపియింగ్ అరికట్టవచ్చని చెప్పారు. రియల్ టైమ్ గవర్నెన్స్‌ను, ఐఓటిని ఈ పుష్కరాల్లో ప్రవేశపెట్టగలిగామన్నారు.
విద్యుత్ శాఖ కృష్ణా పుష్కరాలలో నాణ్యమైన విద్యుత్‌ని అందించారని, రాత్రి వేళల్లో విజయవాడ విద్యుత్ కాంతులతో వెలిగిపోయేటట్లు రకరకాల అందమైన లైట్లను అమర్చారని తెలిపారు. ఈ సెప్టెంబరు లోపు విజయవాడ, విశాఖపట్నంలలో అన్ని వీధులలోని మున్సిపల్ లైట్లను సెన్సర్‌ల ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. పుష్కరాల ముగింపు వేడుకలు ఒలింపిక్ గేమ్స్ వేడుకలకు దీటుగా నిర్వహించుకున్నామన్నారు.

చిత్రం... పుష్కరాల విజయోత్సవ సభలో మాట్లాడుతున్న చంద్రబాబు