ఆంధ్రప్రదేశ్‌

ఇది కేవలం పల్నాడు సమస్యే కాదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), సెప్టెంబర్ 10: వైసీపీ నేతలు, కార్యకర్తల దాడులు, దౌర్జన్యాలు కేవలం గుంటూరు జిల్లా పల్నాడుప్రాంతానికి మాత్రమే పరిమితం కాదని, ఇది టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు రాష్టవ్య్రాప్తంగా ఎదుర్కొంటున్న సమస్య అని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఒక వైపు ప్రభుత్వ విధానాలు, మరో వైపు వైసీపీ నేతల దాడులతో వందలాది కుటుంబాలు జీవనోపాధి పోగొట్టుకున్నాయని మంగళవారం ట్విట్టర్ వేదికగా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వైపు అధికారులు గుంటూరులోని వైసీపీ బాధితుల శిబిరంలో చర్చలు జరుపుతూనే మరో వైపు గురజాల డివిజన్‌లో 144 సెక్షన్ విధించారని విమర్శించారు. ఇది రాజకీయ శాంతి భద్రతల సమస్య అంటూ చెప్పిన ఆయన పండుగల శాంతి భద్రతల అంశం కానే కాదన్నారు. దీన్ని కేవలం పల్నాడు ప్రాంత సమస్యగా ప్రభుత్వ భావిస్తుందని, అయితే రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులపై దాడులు జరుగుతూ గ్రామ బహిష్కరణలు జరుగుతున్నాయన్నారు. బాధితులందరికీ న్యాయం చేయాలన్నదే టీడీపీ సంకల్పమన్నారు. న్యాయం జరిగే దాకా ఈ అంశాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చంద్రబాబు హెచ్చరించారు. అధికారంలోనికి వచ్చిన తరువాత చట్టం వైసీపీ చట్టంగా మారిందా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఒక్క టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలపైనే వేధింపులా అంటూ అవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతి పరులను బెదిరించే వైసీపీ వాళ్ళపై చర్యలు ఉండవా అన్నారు. 151 మేకలు, 23 పులులు అని పోస్ట్ పెడితే అరెస్ట్ చేయడం దారణమన్నారు.