ఆంధ్రప్రదేశ్‌

బకాయిలు చెల్లించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : దేశంలోని వివిధ పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం 2509 కోట్ల రూపాయల మేర బకాయి పడింది. ఈ మొత్తాన్ని చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కె సింగ్ లేఖ రాశారు. వివిధ పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సంస్థలకు దేశవ్యాప్తంగా వివిధ విద్యుత్ పంపిణీ సంస్థలు చెల్లించాల్సిన బకాయిల తాజా వివరాలను సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) వెల్లడించింది. ఈ ఏడాది జూలై 31 నాటికి వివిధ విద్యుత్ పంపిణీ సంస్థలు 9735 కోట్ల రూపాయల మేర బకాయి పడినట్లు తాజా గణాంకాలు తెలియచేస్తున్నాయి. గత ఏడాది ఇదే కాలానికి 8230 కోట్ల రూపాయల మేర బకాయిలు ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే దాదాపు 1500 కోట్ల రూపాయల మేర బకాయిలు పెరగడం ఆయా కంపెనీలను ఆందోళనకు గురి చేస్తోంది. భారీగా బకాయి పడిన రాష్ట్రాల్లో ఏపీ, తమిళనాడు, తెలంగాణ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ 2509.21 కోట్ల రూపాయలు, తమిళనాడు 2413.47 కోట్లు, తెలంగాణ 1580.84 కోట్ల రూపాయల మేర బకాయిలు చెల్లించాల్సి ఉందని సీఈఏ వెల్లడించింది. మొత్తం బకాయిల్లో ఏపీ వాటా దాదాపు 25 శాతం కావడం గమనార్హం.
కాగా, భారీగా పేరుకు పోయిన బకాయిలను చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ లేఖ రాశారు. బకాయిల చెల్లింపుల్లో జాప్యం వల్ల విద్యుత్ పంపిణీ సంస్థలను ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని ఆ లేఖలో హెచ్చరించారు. బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజన్సీకి, ఆర్థిక సంస్థలకు ఆయా పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సంస్థలు డిఫాల్టర్లుగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. దాంతో అది నిరర్థక ఆస్తిగా మారుతుందని తెలిపారు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించే ప్రమాదం కూడా లేకపోలేదని ఆ లేఖలో పేర్కొన్నారు.