కృష్ణ

ఆర్థికంగా బలపడుతున్న ఏపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 24: విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ అభివృద్ధి విషయంలో అన్ని రంగాల్లో ముందుంది. ప్రణాళికాబద్ధంగా లక్ష్యాలను రూపొందించుకుని రెండంకెల వృద్ధి రేటు సాధించింది. మొత్తం జాతీయ స్థూల అదనపు విలువ (జివిఏ - గ్రాస్ వ్యాల్యూయాడెడ్) వృద్ధి రేటుతో పోల్చితే రాష్ట్ర జివిఏ వృద్ధి రేటు ఎక్కువగా ఉంది. కేంద్ర గణాంక కార్యాలయం (సిఎస్‌ఓ) వారి మార్గదర్శలు, నిబంధనల ప్రకారం వివధ రంగాలకు సంబంధించి రూపొందించిన 2015-16 ఆర్థిక సంవత్సరం గణాంక వివరాలను రాష్ట్ర ప్రణాళికా శాఖ విడుల చేసింది. 2014-15లో జాతీయ జివిఏ వృద్ధి రేటు 7.10 శాతం, 2015-16లో 7.30 శాతం ఉండగా రాష్ట్ర జివిఏ వృద్ధి వరుసగా 8.39, 10.50 శాతంగా ఉంది.
ప్రాథమికమైన వ్యవసాయ రంగంలో 2015-16 ఆర్థిక సంవత్సరంలో జాతీయ స్థాయిలో రూ. 16,02,036 కోట్ల విలువైన ఉత్పత్తులతో 1.12 శాతం వృద్ధి రేటు సాధించగా, ఏపి రూ. 1,12,915 కోట్ల విలువైన ఉత్పత్తులతో 8.40 శాతం వృద్ధి రేటు సాధించింది. పారిశ్రామిక రంగంలో జాతీయ స్థాయిలో రూ. 32,58,041 కోట్ల విలువైన ఉత్పత్తులతో 7.35 శాతం వృద్ధి సాధించగా, రాష్ట్రం రూ. 1,21,178 కోట్ల విలువైన ఉత్పత్తులతో 11.13 శాతం వృద్ధి సాధించింది. సేవల రంగంలో జాతీయ స్థాయిలో రూ. 55,77,502 కోట్లతో 9.19 శాతం వృద్ధి సాధించగా రాష్ట్రం రూ. 2,12,391 కోట్లతో 11.39 శాతం వృద్ధి రేటు సాధించింది. దేశంలో 25 ఏళ్ల క్రితం పివి నరసింహరావు హయాంలో మొదలైన ఆర్థిక సంస్కరణల ఫలితాలు మన రాష్ట్రంలో కూడా కనిపిస్తున్నాయి. 1991 నాటి ఆర్థిక సంస్కరణలు ప్రైవేటు రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాయి. దేశంలో సంపదతోపాటు ఉద్యోగ అవకాశాలు, ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెరిగాయి. 1995లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఆ సంస్కరణలను అందిపుచ్చుకున్నారు. ఆర్థిక పరంగా రాష్ట్రంలో గట్టి పునాదులు వేశారు. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వం కూడా ఆయన బాటలోనే వెళ్లవలసి వచ్చింది. మళ్లీ 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గతంలో తాను కొనసాగించిన విధానాలనే మళ్లీ కొనసాగించారు. ఆయన వేసిన పునాదులపై బలపడిన వ్యవస్థ నుంచి మంచి ఫలితాలు రావడం మొదలైంది. వ్యవసాయ రంగంలో రూ. 2,02,365 కోట్లు, పరిశ్రమల రంగంలో రూ. 1,52,706 కోట్లు, సేవల రంగంలో రూ. 3,11,563 కోట్లతో రాష్ట్రం మొత్తం జివిఏ వృద్ధి రేటు 19.54 శాతంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఇండోర్ స్టేడియంలో మున్సిపల్ అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి నారాయణ, కమిషనర్ వీరపాండియన్
సమర్థవంతంగా పని చేశారు
అధికారుల అభినందన కార్యక్రమంలో మంత్రి నారాయణ
విజయవాడ (కార్పొరేషన్), ఆగస్టు 24: గోదావరి పుష్కరాల కన్నా అత్యంత సమర్ధవంతంగా పనిచేసి ప్రజల మన్ననలు పొందడంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ విజయం సాధించిందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. బుధవారం ఉదయం నగరంలోని డిఆర్‌ఆర్ స్టేడియంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డెవలప్‌మెంట్ శాఖ తరఫున పుష్కర విధులు నిర్వర్తించిన కమిషనర్లు, జోనల్ అధికారులు, ఘాట్ ఇన్‌చార్జ్ అధికారులందరినీ అభినందన కార్యక్రమంలో మంత్రి నారాయణ మాట్లాడుతూ గోదావరి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కృష్ణా పుష్కరాల్లో ముందస్థు ప్రణాళికలతోపాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తి వసతులను అందుబాటులోకి తీసుకొచ్చిన నేపథ్యంలో ప్రజలకు మెరుగైన సౌకర్యాలందించామన్నారు. పారిశుద్ద్య సమస్య, ఘాట్లశుభ్రత, నీటి శుభ్రత, తదితర అంశాల్లో సిసి కెమేరాల ద్వారా ప్రతినిత్యం వీక్షిస్తూ కంట్రోల్ రూమ్ నుంచి ఘాట్ల అధికారులకు సమాచారమిచ్చి తక్షణమే పరిష్కరింపచేయడంలో సఫలీకృతులైనామన్నారు. పుష్కర విధులపై ఏదైనా సమాచారం, సూచనలు ఇచ్చే అంశాలుంటే వాటిని లిఖిత పూర్వకంగా ఇన్‌చార్జ్ అధికారులకిస్తే వాటిని డాక్యుమెంటేషన్ లో నోట్ చేస్తామన్నారు. విఎంసి కమిషనర్ వీరపాండియన్ మాట్లాడుతూ పుష్కర విధుల్లో పాల్గొన్న అన్ని స్థాయిల అధికారుల సమిష్టి కృషితోనే విజయం సాధించామన్నారు. ఇంజనీరింగ్, ప్రజారోగ్య, ఉద్యానవన శాఖ, పార్కిగ్ ప్రదేశాలు, పుష్కరనగర్లు, మెడికల్ క్యాంప్‌లు, స్నాన ఘట్టాలు, ప్రధాన రహదారులు, అంతర్గత రహదారులు తదితర అంశాల్లో మున్సిపల్ అధికారులు విశేష సేవలందించారన్నారు. ఈకార్యక్రమంలో విఎంసి అదనపు కమిషనర్ పి అరుణ్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.