ఆంధ్రప్రదేశ్‌

ఘనంగా ప్రారంభమైన రొట్టెల పండుగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, సెప్టెంబర్ 10: మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే నెల్లూరులోని బారాషాహిద్ దర్గాలో రొట్టెల పండుగ మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. మొహర్రం పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రారంభమైన రొట్టెల పండుగ ఈనెల 14వ తేది వరకు జరగనుంది. ఈ రొట్టెల పండుగలో పాల్గొనేందుకు జిల్లా నుండే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి, పలు పక్క రాష్ట్రాలను నుంచి వచ్చిన భక్తులతో రొట్టెలు మార్చుకునే దర్గా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఉదయం నుంచే భక్తుల తాకిడి అధికమైంది. పండుగలో తొలిరోజే సుమారు 2 లక్షల మంది భక్తులు వచ్చారని అధికారులు అంచనాలు వేశారు. ఇక్కడి స్వర్ణాల చెరువులో తమ కోరికల రొట్టెలను అందుకుంటే కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. దీంతో విదేశాల నుంచి కూడా ఈ పండుగకు భక్తులు హాజరవుతారు. ఇక్కడకు వస్తున్న భక్తుల కోసం అధికారులు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారు. భక్తులు రాత్రి సమయంలో నిద్రించేందుకు తాత్కాలిక షెడ్లు నిర్మించారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 2500 మంది పోలీస్ సిబ్బంది పహారా కాస్తున్నారు. దొంగతనాలు, ఇతర నేరాలను నియంత్రించేందుకు డ్రోన్ కెమెరాలతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి 24 గంటలు పనిచేసే విధంగా పోలీస్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. తప్పిపోతున్న చిన్నారులను పట్టుకుని వారి తల్లిదండ్రుల చెంతకు చేర్చేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మంగళవారం 19 మంది చిన్నారులు తప్పిపోతే వారిని వెతికి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. ఈ ఉత్సవాలలో అతి ముఖ్యమైన గంధ మహోత్సవం బుధవారం అర్ధరాత్రి జరగనుంది. గంధ మహోత్సవం తరువాత భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, భారీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి దర్గాను సందర్శించి భక్తుల ఏర్పాట్లను పరిశీలించారు.

చిత్రం... స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకుంటున్న దృశ్యం