కృష్ణ

దివిసీమకు వనె్న తెచ్చిన పుష్కరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, ఆగస్టు 24: ఎన్నో చారిత్రక ఆలయాలు, మహోన్నత చరిత్రకు ఆలవాలమైన దివిసీమలో కృష్ణా పుష్కరాల సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ఈ ప్రాంతానికి వనె్న తెచ్చాయని శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో బుధవారం మధ్యాహ్నం దివిసీమలో కృష్ణా పుష్కరాలను విజయవంతంగా నిర్వహించిన అధికారులు, అనధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛం ద సంస్థల ప్రతినిధులు, పాఠశాలల యాజమాన్యాలకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా జరగని విధంగా దివిసీమలో 12రోజుల పాటు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అబ్బురపర్చాయన్నారు. తెలుగు భాషకు దేవుడైన ఆంధ్రనాయకుడు కొలువై వున్న శ్రీకాకుళంలోని శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు ఆలయానికి జనం పోటెత్తారన్నారు. ఇది అందరి సమష్టి విజయంగా పేర్కొన్నారు. విశేష సేవలు అందించిన వారిని జ్ఞాపికలు, దుశ్శాలువాలతో మండలి ఘనంగా సత్కరించారు. ఆర్డీవో సాయిబాబు, డిఎస్పీ సయ్యద్ ఖాదర్ బాషా, డిఎల్‌పిఓ సత్యనారాయణ, జెడ్పీటిసి బండే శ్రీనివాసరావు, కె వెంకటేశ్వరరావు, సజ్జా గోపాలకృష్ణ, విద్యా సంస్థల ప్రతినిధులు పూర్ణచంద్రరావు, దిట్టా ఉమామహేశ్వరరావు, లంకమ్మప్రసాద్, కె వెంకటేష్, కె ఈశ్వరరావు పాల్గొన్నారు.

‘స్వచ్ఛంద’ సేవలు అనిర్వచనీయం
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, ఆగస్టు 24: కృష్ణా పుష్కరాలు విజయవంతం కావటంలో స్వచ్ఛంద సంస్థలు కీలక పాత్ర పోషించాయని టిడిపి జిల్లా అధ్యక్షులు బచ్చుల అర్జునుడు అన్నారు. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సమష్టి కృషి ఫలితంగా పుష్కరాలు దిగ్విజయంగా ముగిశాయన్నారు. బుధవారం స్థానిక ఆర్ అండ్ బి అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పుష్కరాల విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుష్కరాలను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి పుష్కరాలకు వచ్చే ఏ ఒక్క భక్తుడికి అసౌకర్యం కలగకుండా చూశారన్నారు. ఈ విషయంలో జిల్లా యంత్రాంగం ఎంతో సమర్ధవంతంగా పని చేసిందన్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూడా పుష్కరాలు జరిగే ప్రాంతాల్లో లక్షలాది మందికి భోజన వసతి, మంచినీరు, మజ్జిగ పంపిణీ తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ బూరగడ్డ రమేష్ నాయుడు, ఎఎంసి చైర్మన్ గోపు సత్యనారాయణ, టిడిపి పట్టణ అధ్యక్షులు ఇలియాస్ పాషా, పార్టీ నాయకులు పివి ఫణికుమార్ పాల్గొన్నారు.