ఆంధ్రప్రదేశ్‌

‘ఈ-పోస్’ అమలుకు కమిటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 24: ఆంధ్రప్రదేశ్‌లో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో పని చేస్తున్న ఈ-పోస్ విధానాన్ని పర్యవేక్షించేందుకు గాను మహిళా, శిశు సంక్షేమ ఆధ్వర్యంలో రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి కమిటీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిత్యావసరాల పంపిణీలో గత ఏడాది డిసెంబర్ 1 నుంచి అమల్లోకి తెచ్చిన ఈ-పోస్ విధానాన్ని సమర్ధవంతంగా అమలు చేసే ప్రక్రియలో భాగంగా ఈ పర్యవేక్ష కమిటీలను నియమిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర స్థాయి కమిటీకి చైర్‌పర్సన్‌గా మహిళా, శిశు సంక్షమ శాఖ ముఖ్యకార్యదర్శి, సభ్యులుగా పౌరసరఫరాల శాఖ కమిషనర్, పౌరసరఫరాల సంస్థ విసి, ఎండి, స్టేట్ ఇన్‌ఫార్మేటిక్ ఆఫీసర్, ఈ-పోస్ డివైస్ సాఫ్ట్‌వేర్ ప్రాజెక్టు మేనేజర్‌లను నియమించగా, సభ్య కన్వీనర్‌గా మహిళా, శిశుసంక్షేమ శాఖ ప్రత్యేక కమిషనర్‌ను ప్రభుత్వం నియమించింది. జిల్లా కమిటీకి చైర్‌పర్సన్‌గా జాయింట్ కలెక్టర్, సభ్యులుగా జిల్లా పౌరసరఫరాల అధికారి, పౌరసరఫరాల సంస్థ మేనేజర్, జిల్లా ఇన్‌ఫార్మేటిక్స్ అధికారి, ఇన్‌ఫార్మేటిక్స్ సాంకేతిక అధికారి, ఈ-పోస్ నుంచి ఒకరు, జిల్లా పౌరసరఫరాల డీలర్ల సంఘం అధ్యక్షుడు, సభ్య కన్వీనర్‌గా జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ పిడిలను నియమించింది. మండల స్ధాయి కమిటీకి చైర్‌పర్సన్‌గా ఎమ్మార్యో, సభ్యులుగా పౌరసరఫరాల విభాగం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, రూట్ ఆఫీసర్లు, ఆ మండల పర్యవేక్షకుడు, సభ్య కన్వీనర్లుగా సిడిపిఓ, ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి వ్యవహరిస్తారని ప్రభుత్వం వెల్లడించింది. సక్రమంగా నిర్ణీత గడువులోగా నిత్యావసరాలు రవాణా జరుగుతున్నదీ, స్టాక్ పాయింట్ల నుంచి రేషన్ షాపులను వెళుతున్నదీ, పంపిణీ ఏమేరకు జరిగిందీ, ఈ-పోస్ అమలు ఎలా ఉందనే అంశంపై పర్యవేక్షణ చేసి ఆ పై కమిటీలకు ఎప్పటికప్పుడు నివేదికలను అందించాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.