ఆంధ్రప్రదేశ్‌

పవన్ వాస్తవాలు తెలుసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 15: జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్‌ను వల్లె వేయకుండా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు సూచించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ 100 రోజుల పాలనపై ప్రతిపక్ష నేత చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ వేసిన పుస్తకాలు తమకు సర్ట్ఫికెట్లు కావని, తమకు ప్రజలు ఇచ్చిందే అసలైన సర్ట్ఫికెట్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతితో పాటు పవన్‌కళ్యాణ్ లావాదేవీలను కూడా వెలికి తీస్తామన్నారు. లింగమనేని వద్ద నుండి ఎకరం 25లక్షల రూపాయలకే బ్లాక్‌మనీతో కొన్నారా? చంద్రబాబుతో పవన్‌కు ఉన్న ఒప్పందం వల్ల తక్కువ ధరకే పొలాలు ఇచ్చారా? అనే వాటన్నింటిపై వాస్తవాలు బయటకు తెచ్చే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తుందన్నారు. అసెంబ్లీలో 19 బిల్లులు ప్రవేశపెట్టి చట్టరూపం తెచ్చామని, శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు చేశామని, నామినేటెడ్ పదవుల్లో, పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చరిత్రాత్మక నిర్ణయాలు సీఎం జగన్ తీసుకున్నారని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఒక్క బెల్టుషాపు కూడా లేకుండా చేసిన ఘనత తమకే దక్కుతుందన్నారు. ప్రతి ఏడాది అమ్మకాలు తగ్గేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. కాపుల ఓట్లు చీలుస్తారని చంద్రబాబు పవన్‌కళ్యాణ్‌ను ప్రోత్సహిస్తే ఆయన ప్రయత్నాలు బెడిసికొట్టాయన్నారు. ప్రశాంతంగా ఉన్న పల్నాడులో ఫ్యాక్షనిజం అంటూ గ్రామాల్లో కక్షలు రేకెత్తించే ప్రయత్నం చేశారన్నారు. చంద్రబాబు పులివెందుల పంచాయతీ అంటూ ఒకే మాటను పదిసార్లు వల్లె వేస్తే ప్రజలు నమ్ముతారని అనుకోవడం పొరపాటన్నారు. చంద్రబాబు కోడెలకు టిక్కెట్ ఇచ్చి గెలిపించి స్పీకర్‌ను చేస్తే అసెంబ్లీ ఫర్నిచర్‌ను కూడా ఇంట్లో పెట్టుకున్న చరిత్ర దక్కించుకున్నారని ధ్వజమెత్తారు. అలాంటి వారిని పార్టీ నుండి ఎందుకు బహిష్కరించడం లేదో తెలుగుదేశం పెద్దలే చెప్పాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.
*చిత్రం... వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు