ఆంధ్రప్రదేశ్‌

అన్న క్యాంటీన్లకు సున్నమెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 15: పేదల ఆకలితీర్చే అన్న క్యాంటీన్లను రద్దుచేసి వైసీపీ ప్రభుత్వం వారి నోటికాడి కూడు తీసేసిందని, క్యాంటీన్లు మూసివేయాలనుకున్న ప్రభుత్వం వాటికి ఉన్న రంగులు తొలగించి సున్నం ఎందుకు పూస్తోందని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ప్రశ్నించారు. ఆదివారం టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్టవ్య్రాప్తంగా ఉన్న అన్న క్యాంటీన్ల రంగులు మార్చేందుకు కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. మంత్రి బొత్స సత్యనారాయణ త్వరలో కొత్త పాలసీ తెస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, పేదలకు పట్టెడన్నం పెట్టడానికి కూడా పాలసీ అనడం చేతగానితనానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైనా అన్న క్యాంటీన్లపై ఎందుకు నిర్ణయం తీసుకోలేక పోయిందని నిలదీశారు. చంద్రబాబు పాలనలో రోజుకు 3లక్షల మంది కడుపు నింపుకుని ఆనందంగా ఉండగా, అన్న క్యాంటీన్ల రద్దు కారణంగా నేడు అర్ధాకలితో అలమటిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కనీసం ఒక్కసారైనా అన్న క్యాంటీన్ల గురించి ఎందుకు సమీక్ష చేయలేదని ప్రశ్నించారు. ప్రజలకు కావాలని కోరుకునే వాటి గురించి ప్రభుత్వం పట్టించుకోకుండా తమవారికి లబ్ధికలిగే అంశాల పైనే మొండిగా ముందుకెళుతోందని మండిపడ్డారు. న్యాయస్థానాలు, మేధావులు, కేంద్ర ప్రభుత్వం వద్దంటున్నా పోలవరం రీ టెండరింగ్‌పై వైసీపీ ప్రభుత్వం ముందుకెళ్లడం సరికాదన్నారు. రివర్స్ టెండర్ల పేరుతో వైసీపీ నేతలకు కోట్లు కట్టబెట్టాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం అత్యుత్సాహం కనబరుస్తోందని సత్యప్రసాద్ ఆరోపించారు.