ఆంధ్రప్రదేశ్‌

శ్రీశైలం గోశాలలో గోఆర్క్ తయారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం సెప్టెంబర్ 15: శ్రీశైలం దేవస్థానం నిర్వహిస్తున్న గోశాలలో గోఆర్క్ తయారుచేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ మేరకు గోఆర్క్ తయారీకి ఆదివారం శ్రీకారం చుట్టారు. దేవస్థానం ఈఓ కెఎస్.రామారావు పూజలు చేసి గోశాలతో గోఆర్క్ తయారీని ప్రారంభించారు. త్వరలో పెద్దమొత్తంలో గోఆర్క్ తయారుచేసి భక్తులకు విక్రయించనున్నట్లు ఆయన తెలిపారు. ధర ఇంకా నిర్ణయించలేదని, ఆర్క్ తయారీ, సీసాల్లో నిల్వను భట్టి నిర్ణయిస్తామన్నారు. గో మూత్రాన్ని డిస్టిలేషన్ చేయడం ద్వారా గోఆర్క్ తయారుచేస్తారు. పలు ఔషధగుణాలున్న గోఆర్క్ విశేష ప్రాచుర్యం పొందింది. అన్నిరకాల రోగాలను నయం చేసే గోఆర్క్ సరసమైన ధరకు శ్రీశైలం భక్తులకు త్వరలో అందుబాటులోకి రానుంది. మార్కెట్‌లో గోఆర్క్‌కు లభిస్తున్న ఆదరణను చూసి ఇక్కడి గోశాలలో ఉన్న ఆవుల నుంచి సేకరించిన మూత్రంతో ఆర్క్ తయారుచేయాలని శ్రీశైలం దేవస్థానం నిర్ణయించి ఆ దిశగా కార్యచరణకు శ్రీకారం చుట్టింది. త్వరలో శ్రీశైలం దేవస్థానం గోశాలలో తయారుచేసిన గోఆర్క్ భక్తులకు సరసమైన ధరకు అందుబాటులోకి రానుంది.

*చిత్రం... శ్రీశైలం గోశాలలో గోఆర్క్ తయారీ సందర్భంగా పూజలు చేస్తున్న ఈఓ కెఎస్.రామారావు