ఆంధ్రప్రదేశ్‌

టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గన్నవరం, సెప్టెంబర్ 15: కృష్ణా జిల్లా తేలప్రోలులో గణేష్ నిమజ్జన కార్యక్రమంలో ఘర్షణ జరిగింది. టీడీపీ కార్యకర్తల దాడిలో ఆత్కూరు ఎస్‌ఐ శ్రీనివాసరావు, ఓ పోలీస్ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. తెలప్రోలు సుందరయ్య కాలనీలో జిల్లా తెలుగుయువత కార్యదర్శి భీమవరపు యతేంద్ర రామకృష్ణ ఏర్పాటు చేసిన వినాయకుడి నిమజ్జన యాత్ర జరిగింది. ఈసందర్భంలో వైసీపీ నాయకులను రెచ్చగొట్టేలా గాలిగోపురం సెంటర్‌లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడును పొగుడుతూ పాటలు పెట్టారు. శనివారం రాత్రి 11గంటల సమయంలో నిమజ్జన యాత్ర వైఎస్‌ఆర్ సీపీ కార్యాలయం వద్దకు చేరుకుంది. టీడీపీ జిందాబాద్, వంశీ జిందాబాద్ అంటూ టీడీపీ నాయకులు వైసీపీ నాయకులపై రాళ్ల దాడికి దిగారు. ఘర్షణలో వైసీపీ నాయకులకు స్వల్పంగా, ఆత్కూరు ఎస్‌ఐ శ్రీనివాసరావు, కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడే ఉన్న వైసీపీ మండల అధ్యక్షుడు వింతా శంకరరెడ్డి వెంటనే ఎస్‌ఐకు ప్రథమ చికిత్స చేశారు. అనంతరం పోలీసు వాహనంలో ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
*చిత్రం... రాళ్ల దాడిలో గాయపడిన ఎస్‌ఐ తలకు టవల్ చుడుతున్న వైసీపీ నేత శంకర్‌రెడ్డి