ఆంధ్రప్రదేశ్‌

టీడీపీలో పెయిడ్ ఆర్టిస్టు పవన్‌కల్యాణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, సెప్టెంబర్ 15: తెలుగుదేశంలో పెయిడ్ ఆరిస్టు పవన్‌కల్యాణ్ అని వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి సీ.రామచంద్రయ్య అన్నారు. తెలుగుదేశం నుండి ఆయనకు ఎలాంటి ప్రయోజనాలు అందుతున్నాయో గానీ చంద్రబాబు రాయించిన స్క్రిప్టు చదువుతున్నారని, అది ఆయనకు మంచిదికాదని సలహా ఇచ్చారు. ఆదివారం కడప నగరంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సొంతంగా తన పార్టీని బలోపేతం చేసుకునేంత రాజకీయ జ్ఞానం పవన్‌కల్యాణ్‌కు లేదన్నారు. అందుకే తెలుగుదేశంలో పెయిడ్ ఆర్టిస్టుగా మారిపోయారని విమర్శించారు. పవన్‌కల్యాణ్ లాంటి వ్యక్తుల వల్ల రాజకీయాలకు ప్రజల్లో అప్రతిష్ట కలుగుతోందన్నారు. చంద్రబాబు విజన్, పవన్‌కల్యాణ్ విజన్ వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ప్రభుత్వానికి అవసరం లేదని అన్నారు. నవరత్నాల ద్వారా తమ ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్తోందని, వాటిని నిజాయితీగా అమలుచేసి ప్రజలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. చంద్రబాబు అవినీతి సొమ్మును ప్రతి పైసా కక్కిస్తామని రామచంద్రయ్య తెలిపారు. అమ్మఒడి పథకం మంచిదా కాదా అనేది స్పష్టం చేయకుండా, పవన్‌కల్యాణ్ ఆ పథకాన్ని విమర్శించడం, సూచనలు చేయడం సరికాదన్నారు. ఇంట్లో ఉన్న ప్రతి పిల్లవాడికి అమ్మఒడి వర్తించేలా చూడాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భవిష్యత్ లక్ష్యమని ఆయన తెలిపారు. చంద్రబాబు వ్యవస్థలను నాశనం చేసి పోయాడని చెబుతూ, బాబు అవినీతిని ప్రశ్నించే దమ్ము పవన్‌కల్యాణ్‌కు లేదని విమర్శించారు.
*చిత్రం...కడపలో విలేఖరులతో మాట్లాడుతున్న వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సీ.రామచంద్రయ్య