ఆంధ్రప్రదేశ్‌

పట్టణ స్థానిక సంస్థలకు 14వ ఆర్థిక సంఘం నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 16: రాష్ట్రంలోని వివిధ పట్టణ స్థానిక సంస్థలకు 14వ ఆర్థిక సంఘం నిధులు 146.69 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఫెర్ఫార్మెన్సు గ్రాంట్‌గా ఈ నిధులు విడుదల చేస్తూ పాలనామోదాన్ని తెలియచేసింది. ఈ నిధులను ఆయా పట్టణ స్థానిక సంస్థలకు కేటాయించాలని పురపాలక శాఖను ఆదేశించింది.
టెక్నికల్ ప్రాజెక్టుల సలహాదారుగా లోకేశ్వరరెడ్డి
రాష్ట్ర ప్రభుత్వానికి టెక్నికల్ ప్రాజెక్టులకు సంబంధించి సలహాదారుగా తుమ్మల లోకేశ్వర రెడ్డిని నియమించింది. పదవీ కాలం, వేతనం తదితర అంశాలపై వేరే ఉత్తర్వు జారీ చేయనుంది. ఏపీ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీగా ఎం. మధుసూదన రెడ్డిని నియమించింది. ఏపీ స్టేట్ బీవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా డి. వాసుదేవ రెడ్డిని నియమించింది.
ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్‌గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి సీవీ నాగార్జున రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 30 నుంచి ఆ పదవిలో కొనసాగుతారు. ఐదు సంవత్సరాలు లేదా 70 సంవత్సరాల వయసులో ఏది ముందు అయితే అది వర్తిస్తుంది.
50 శాతం రిజర్వేషన్ మార్గదర్శకాలు జారీ
నామినేషన్ పద్ధతిలో ఇచ్చే కాంట్రాక్టు పనులు, సర్వీస్ కాంట్రాక్టుల్లో 50 శాతాన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రిజర్వు చేయడం తెలిసిందే. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జారీ చేసింది. బీసీలకు 29 శాతం, ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు 6 శాతం కేటాయించింది. ఇందుకు సంబంధించి కామన్ వెబ్ పోర్టల్‌ను నెల రోజుల్లో సిద్ధం చేయాలని ఆ ఉత్తర్వులో పేర్కొంది. 100 పాయింట్ల రోస్టర్‌ను కూడా సిద్ధం చేసింది. ఇందులో 50 శాతం మహిళలకు కేటాయించింది.