ఆంధ్రప్రదేశ్‌

ఇండో, థాయ్, సింగపూర్ త్రైపాక్షిక విన్యాసాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 16: భారత నౌకదాళం, రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ నేవీ (ఆర్‌ఎస్‌ఎన్), రాయల్ థాయ్‌లాండ్ నేవీ (ఆర్‌టీఎన్) దేశాలు త్రైపాక్షిక నౌకాదళ విన్యాసాలు పోర్ట్‌బ్లెయిర్‌లో సోమవారం ప్రారంభమయ్యాయి. అయిదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో మూడు దేశాల మధ్య అంతర్గత నౌకావాణిజ్యంపై దృష్టి సారించనున్నారు. ఈ రీజియన్‌లో నౌకా వాణిజ్య భద్రతపై కూడా పలు అంశాలు ప్రాస్తవించుకోనున్నారు. మూడు దేశాల నౌకాదళాల మధ్య అవగాహనాపూరిత సహకారం విస్తరించుకునే దిశగా నిర్ణయాలు తీసుకుంటారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎన్ గైడెడ్ ఫైటల్ స్తెల్త్ మిస్సైల్స్, థాయ్‌లాండ్ నేవీకి చెందిన గైడెడ్ మిస్సైల్ ఫైటర్, భారత నౌకాదళానికి చెందిన గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ ఐఎన్‌ఎస్ రణవీర్, మిస్సైల్ కర్వర్టర్ ఐఎన్‌ఎస్ కోరా, తీర రక్షణ పెట్రోలింగ్ నౌక సుకన్య సహా లాంగ్ రేంజ్ మ్యారీటైం రక్షణకు ఉపయోగించే పీ 8ఐ ఎయిర్‌క్రాఫ్ట్ విన్యాసాలు సాగించాయి. సీ ఫేజ్ ఎక్సర్ సైజ్‌లో భాగంగా ఈ విన్యాసాలు జరుగుతాయి. అనంతరం మూడు దేశాలకు చెందిన నౌకాదళ సిబ్బంది సాంకేతికతను పరస్పరం అందిపుచ్చుకోవడంతో పాటు క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

*చిత్రం...మూడు దేశాల నౌకాదళ అధికారులు