ఆంధ్రప్రదేశ్‌

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కుండపోత వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 17: గుంటూరు, కృష్ణాజిల్లాల్లో కుండపోత వర్షానికి జనజీవనం అస్తవ్యస్థమైంది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన వర్షం సుమారు 2 గంటల పాటు ఏకధాటిగా కురిసింది. గుంటూరు నగరంతో పాటు దాదాపు అన్ని మండలాల్లో రహదారులు జలాశయాలను తలపించాయి. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోకి వర్షపునీరు భారీగా చేరడంతో బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షం కారణంగా నగరంలో పలు చోట్ల పెద్ద పెద్ద వృక్షాలు సైతం నేలకొరిగి రహదారులపై అడ్డంగా పడటంతో ప్రయాణికులు పలు ఇబ్బందులు పడ్డారు. గుంటూరు-హైదరాబాద్ మార్గమధ్యలోని రాజుపాలెం శివారు రెడ్డిగూడెం వద్ద రాళ్లవాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో ఈ ప్రాంతంలో మూడు గంటలకు పైగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అమరావతి-నరుకుళ్లపాడు మధ్య గల మేళ్లవాగు ప్రమాద స్థాయిలో పొంగిపొరలి ప్రవహించడంతో వాగు పరివాహక ప్రాంత పొలాలు నీటమునిగాయి. తాడికొండ, పెదనందిపాడు, నర్సరావుపేట, ప్రత్తిపాడు, కాకుమాను తదితర మండలాల్లో భారీగా కురిసిన వర్షాలకు పంటపొలాలు చెరువులను తలపించాయి. విజయవాడ నగరంలో భారీ వర్షం కారణంగా జనజీవనం అస్తవ్యస్తమయింది. నగరంలోని రహదారులపై అడుగు నుంచి రెండడుగుల మేర నీరు ప్రవహించటంతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
*చిత్రం... గుంటూరు-హైదరాబాద్ మార్గంలో రోడ్డుపై ప్రవహిస్తున్న రాళ్లవాగు