ఆంధ్రప్రదేశ్‌

కోడెలను కేసులతో వేధించారు: డొక్కా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 17: శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిచెందిన తర్వాత కూడా మనశ్శాంతి లేకుండా దుష్ప్రచారం చేయడం, ఆయన కుటుంబంపై బురదచల్లాలని చూడటం అత్యంత బాధాకరమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ తీవ్రంగా స్పందించారు. మంగళవారం గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో డొక్కా మాట్లాడుతూ కోడెలకు మంత్రి పదవి ఇవ్వకుండా స్పీకర్ పదవి ఇచ్చి టీడీపీ అధినేత చంద్రబాబు అవమానించారంటూ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను ఖండించారు. రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కొలేక కోడెల చనిపోలేదన్నారు. కేసుల పేరుతో వేధించి, అవమాన పరిచినందుకే ఆయన ప్రాణాలు తీసుకున్నారన్నారు. ఆయన జీవితమే పోరాటంగా బతికారని శ్లాఘించారు. ఇప్పటికైనా చనిపోయిన తన తండ్రి గురించి మంచిమాటలు మాట్లాడాలని కోడెల కుమార్తె కన్నీటితో వేడుకుంటున్నా వైసీపీ నేతల మనసు కరగకపోవడం అత్యంత దారుణమన్నారు.
నర్సరావుపేటలో 144 సెక్షన్ ఎత్తివేయాలి: వర్ల
ప్రజా నాయకుడు అనంతలోకాలకు చేరి, ఆయన కుటుంబం, తెలుగుదేశం పార్టీ యావత్తు శోకసంద్రంలో మునిగిపోయిన వేళ, ఆయన అంతిమయాత్ర హైదరాబాద్ నుంచి గుంటూరుకు వస్తున్న తరుణంలో వైఎస్ జగన్మోహనరెడ్డి ఆయన మంత్రివర్గం శవ రాజకీయాలు చేయడం వారి వికృతత్వానికి నిదర్శనమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఆదేశాలు, వైసీపీ నేతల వేధింపులు, అధికార యంత్రాంగం సాధింపులే కోడెల మృతికి కారణమన్నారు. వెంటనే నర్సరావుపేటలో 144 సెక్షన్ ఎత్తివేయకుంటే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వర్ల హెచ్చరించారు.