ఆంధ్రప్రదేశ్‌

ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 17: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, అనగాని సత్యప్రసాద్, గద్దే రామ్మోహన్‌రావు ఎన్నికను సవాల్‌చేస్తూ ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులు దాఖలుచేసిన ఎన్నికల వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. ఈ మేరకు ముగ్గురు ఎమ్మెల్యేలకు మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు కూడా నోటీసులిచ్చింది. తదుపరి విచారణను అక్టోబర్ 14కు వాయిదా వేసింది. న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ జి. శ్యాంప్రసాద్, జస్టిస్ ఎం. గంగారావు వేర్వేరుగా ఈ ఉత్తర్వులు జారీచేశారు. విశాఖ ఉత్తర శాసనసభ నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాసరావు ఎన్నికను రద్దు చేయాలని ప్రత్యర్థి, వైకాపా అభ్యర్థి కె కన్నప్పరాజు, రేపల్లె నుంచి అనగాని సత్యప్రసాద్ ఎన్నికను సవాల్‌చేస్తూ మంత్రి మోపిదేవి వెంకటరమణ, విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గద్దే రామ్మోహన్ ఎన్నిక రద్దు చేయాలంటూ వైకాపా అభ్యర్థి బొప్పన భవకుమార్ తరుపున హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషనర్ల తరుపున న్యాయవాది మలసాని మనోహర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ఎన్నికల నిబంధనల ప్రకారం పోటీచేసే వ్యక్తి అఫిడవిట్‌లో తన ఆదాయం, వృత్తి వివరాలు తెలియజేయాల్సి ఉండగా ఈ ముగ్గురూ వాటిని పొందుపరచలేదని, అనగాని సత్యప్రసాద్ కూడా ఆదాయ వివరాలు పేర్కొనలేదని వివరించారు.