ఆంధ్రప్రదేశ్‌

ఎనిమిది మంది జాడ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 17: పాపికొండలు విహారయాత్రకు వెళ్లి గోదావరి బోటు ప్రమాదంలో గల్లంతైన వారి ఆచూకీ ఇంతవరకూ జాడలేదు. విశాఖ నగరం, జిల్లా నుంచి 18 మంది పాపికొండలు సందర్శించేందుకు ఆదివారం ప్రమాదానికి గురైన బోట్‌లో బయలుదేరారు. వీరిలో 13 మంది ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా, మరో నలుగురు ఒక కుటుంబానికి చెందిన వారితో పాటు మరో వ్యక్తి ఉన్నారు. విశాఖ నగరంలో నివాసం ఉంటున్న మదుపాడ రమణబాబు, అతని భార్య అరుణ కుమారి, కుమారుడు అఖిలేష్, కుమార్తె కుషాలితో పాటు పెద్దక్క తలారి అప్పలనర్సమ్మ, ఈమె మనుమలు గీతా వైష్ణవి, అనన్య, వేపగుంటలో ఉంటున్న చిన్నక్క బొండ లక్ష్మి, బొండా పుష్ప, అనకాపల్లి సమీపంలోని గోపాలపురంలో ఉంటున్న పెద్ద అత్త మనుమలు పూర్ణ, సుస్మిత పెదిరెడ్ల దాలమ్మ ఉన్నారు. వీరితో పాటు వెళ్లిన మృతుడు రమణబాబు పెద్దత్త బూసాల లక్ష్మి మాత్రం ఘటన నుంచి సురక్షితంగా బయటపడింది.
ఇక గాజువాకకు చెందిన బాచిరెడ్డి మహేశ్వర రెడ్డి అతని భార్య స్వాతి, కుమారుడు విఖ్యాంత్, కుమార్తె హాసిక, స్నేహితుడు సీతారామరాజు ఉన్నారు. బోటు ప్రమాదంలో విశాఖ నుంచి వెళ్లిన వారిలో కేవలం ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. మిగిలిన 17 మంది గల్లంతయ్యారు.
గల్లంతైన వారిలో ఇప్పటి వరకూ తొమ్మిది మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. తలారి అప్పలనర్సమ్మ (54), బోండా లక్ష్మి (35) మృతదేహాలు సోమవారమే లభ్యం కాగా, బీ పుష్ప (25), బీ పూర్ణ (23), ఎం రమణబాబు (35), సుస్మిత (4), స్వాతి (35), హాసిక (5), ఎంవీ సీతారామరాజు (52) మృతదేహాలు మంగళవారం లభ్యమయ్యాయి. ఇప్పటికీ మదుపాడ అరుణకుమారి, అఖిలేష్, కుషాలి, గీత వైష్ణవి, అనన్య, పెదిరెడ్ల దాలమ్మ, బీ మహేశ్వర రెడ్డి, విఖ్యాంత్ ఆచూకీ దొరకలేదు. దీంతో ఆయా కుటుంబాల్లో అంతులేని ఆవేదన చోటుచేసుకుంది. తమవారు తిరిగి వస్తారన్న నమ్మకం లేనప్పటికీ ఆశ చంపుకోలేక వీరికోసం ఎదురు చూస్తూనే ఉన్నారు.