ఆంధ్రప్రదేశ్‌

వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంజామల, సెప్టెంబర్ 17: కర్నూలు జిల్లా సంజామల మండలం ముదిగేడు సమీపంలో మంగళవారం కోవెలకుంట్ల డిపో ఆర్టీసీ బస్సు వరద నీటిలో చిక్కుకుంది. అయితే సమీప గ్రామ ప్రజలు అప్రమత్తమై తాళ్ల సాయంతో ప్రయాణికులను బయటకు తీసుకువచ్చారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. సోమ, మంగళవారం కురిసిన భారీ వర్షాలకు సంజామల మండలంలో పలు వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పాలేరువాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వంతెనలపై నుంచి నీరు ప్రవహిస్తోంది. ఈక్రమంలో మంగళవారం కోవెలకుంట్ల ఆర్టీసీ డిపో బస్సు అవుకు మండలం చెన్నంపల్లె, శివవరం, సంజామల మండలంలోని వసంతాపురం, ఓత్రమానుదినె్న, బందెల్‌దినె్న, కమలపురి గ్రామాల మీదుగా విద్యార్థులు, ప్రయాణికులతో బయలుదేరింది. సంజామల మండలం ముదిగేడు సమీపంలోని బోడాయికుంట వద్ద రహదారిపై వరద ఉద్ధృతంగా ప్రవహించడంతో డ్రైవర్ బస్సును వాగు దాటించే ప్రయత్నం చేశాడు. అయితే బస్సు వాగు మధ్యలోకి వెళ్లగానే ఇంజన్‌లోకి నీళ్లు రావడంతో ఆగిపోయింది. దీంతో బస్సులోని విద్యార్థులు, ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. వరద ప్రవాహాన్ని చూసేందుకు సమీప గ్రామ ప్రజలు ట్రాక్టర్‌కు తాడు కట్టి అతి కష్టం మీద బస్సు వరకు వెళ్లి అందులోని విద్యార్థులు, ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
*చిత్రం...సంజామల మండలం ముదిగేడు వద్ద వరద నీటిలో చిక్కుకున్న
బస్సు నుంచి తాడు సాయంతో ఒడ్డుకు చేరుకుంటున్న ప్రయాణికులు