ఆంధ్రప్రదేశ్‌

మాజీ స్పీకర్ మృతికి పరోక్షంగా బాబే కారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 17: ఏపీ శాసనసభ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత డాక్టర్ కోడెల శివప్రసాదరావు మృతికి పరోక్షంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే కారణమని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బతికి ఉన్నప్పుడు హింసించడం, చనిపోయాక శవ రాజకీయాలు చేయడం చంద్రబాబు నైజమని విమర్శించారు. కోడెలను అవమానాలకు గురిచేసి ఆయనను ఆత్మహత్యకు చంద్రబాబే ప్రేరేపించారన్నారు. కోడెలపై అంత అభిమానం, ప్రేమ ఉంటే ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే ఎందుకు పరామర్శించ లేదని ప్రశ్నించారు. కోడెల మృతదేహాన్ని పక్కనబెట్టుకుని చంద్రబాబు మాట్లాడుతున్న తీరు చూస్తే ఎవరికైనా ఏహ్యభావం కలగకతప్పదన్నారు. కోడెల మరణానికి కుమారుడు ఒక కారణమైతే, మరో పక్క చంద్రబాబు వేధించి, మానసిక క్షోభకు గురిచేశారన్నారు. తప్పుడు కేసులు బనాయించారని టీడీపీ నేతలు అంటున్నారని, రైల్వే కాంట్రాక్టరే స్వయంగా కేసు పెడితే అందుకు వైసీపీది బాధ్యత ఎలా అవుతుందని ప్రశ్నించారు. చనిపోయిన వ్యక్తి పట్ల గౌరవం కూడా లేకుండా నీచ రాజకీయాలు చేయడం బాబు కుసంస్కారానికి అద్దం పడుతుందన్నారు. కోడెల మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలని తాము తెలంగాణ ప్రభుత్వాన్ని కోరామని, త్వరలోనే నిజానిజాలు వెలుగులోకి వస్తాయని గడికోట పేర్కొన్నారు.