ఆంధ్రప్రదేశ్‌

కోడెలకు స్వపక్షం నుంచే పరోక్ష దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 17: ఏ ఒక్కరూ ఊహించని రీతిలో ఘోర పరాజయం చెంది... ఫిరాయింపుల పర్వంతో టీడీపీ అతలాకుతలమవుతున్న నేపథ్యంలో ఆవిర్భావం నుంచి ఆఖరి క్షణం వరకు పార్టీనే నమ్ముకున్న డాక్టర్ కోడెల శివప్రసాదరావు కారణాలేమైనా తాను ఊపిరి తీసుకుని ఎంతో కొంత మేర పార్టీకి ఊపిరి పోశారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అధికారపక్ష కక్ష సాధింపు చర్యల వల్లనే పల్నాటిపులిగా పేరొందిన కోడెల ఆత్మహత్య చేసుకున్నారన్న సానుభూతి కొందరిలోనైనా కల్పించగలిగారంటున్నారు. అయితే ఆఖరి క్షణాల్లో విపక్షం కంటే స్వపక్షం నుంచే అన్ని స్థాయిల్లోనూ కోడెలకు సహాయ నిరాకరణ ఎదురయిందనేది వాస్తవం. సామాన్య కార్యకర్తలు అధికార పక్షానికి భయపడి కోడెలకు అనుకూలంగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయారు. అన్నింటి మించి కోడెల నమ్ముకున్న ఆ పార్టీ అధినేత చంద్రబాబే చివరి రోజుల్లో చేయూతనివ్వకపోవటం అటుంచి కనీసం ధైర్యం కూడా చెప్పలేకపోయారనేది నిర్వివాదాంశం. స్థానిక అంశాలపై కేసులపై కేసులతో పాటు స్పీకర్ పేషీ సామగ్రి వరకు ప్రత్యేక కేసులు, నాన్ బెయిలబుల్ సెక్షనలతో కుటుంబ సభ్యులపై కేసులు చుట్టిముట్టిన నేపథ్యంలో వాస్తవానికి గత నెల 23వ తేదీ తొలిసారిగా కోడెల ఆత్మహత్యాయత్నం చేశారనే ప్రచారం సాగుతోంది. కుటుంబ సభ్యులు ఆ విషయం బయటకు రాకుండా గండెపోటు అంటూ దాదాపు ఐదారు రోజులపాటు గుంటూరులోని ఆసుపత్రిలో ఐసీయులో ఉంచారు. అయితే నాటి నుంచి చనిపోయేటంతటి వరకు కనీసం ఒక్కసారైనా చంద్రబాబు గానీ ఆయన తనయుడు లోకేష్‌గానీ వెళ్లి పరామర్శించి భయపడొద్దు తామున్నామనే ధైర్యం చెప్పలేకపోయారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు వెళ్లి పరామర్శించక పోవటం వల్లనే ఇతర ముఖ్యనేతలు కూడా కోడెల వద్దకు వెళ్ళేందుకు సాహసించలేకపోయారని చెబుతున్నారు. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే చంద్రబాబు అదే సమయంలో పార్టీతో సంబంధంలేని ఓ మైనార్టీ నేత గుంటూరులో మరణిస్తే వెళ్లి పరామర్శించారు. గుంటూరు పశ్చిమంలో వినాయక పందిరికి వెళ్లివచ్చారు.
ఇలా దాదాపు ప్రతి రోజు వెళ్లివస్తూనే ఉన్నారు. అసలు కోడెల ఓటమికి కూడా స్వపక్ష నేతలే కారణమనేది నిర్వివాదాంశం. 2014లో స్వల్ప అధిక్యతతో గెలిచిన కోడెల గత ఎన్నికల్లో అదే అంబటి రాంబాబు చేతిలో 16వేల ఓట్లపైగా తేడాతో ఓటమిపాలయ్యారు. ఓటమి తర్వాత కేసులపై కేసులు ఇతరత్రా దాడులు జరుగుతున్నా స్వపక్షం నుంచి ఎలాంటి చేయూత లేదు. ఆఖరికి పార్టీ చేపట్టిన చలో ఆత్మకూరు కార్యక్రమానికి కూడా ఆహ్వానం లేదు. అదే సమయంలో కోడలపై పరోక్ష దాడికి దిగిన మాజీ ఎంపీ రాయపాటిని పార్టీ నాయకత్వం ప్రోత్సహించిందనే విమర్శలు లేకపోలేదు. చివరిగా కోడెల గురించి ఒక్క మాట చెప్పాలంటే తొలి నుంచి టీడీపీకి తొలుత ఎన్టీఆర్ ఆపై చంద్రబాబుకు విధేయునిగా ఉంటూనే వచ్చారు. 2014 ఎన్నికల్లో కోడెల మంత్రి పదవిని ఆశించి తీవ్ర భంగపాటుకు గురయ్యారు. అదే సమయంలో ఒకరిద్దరు పత్రికాధిపతులు అత్యంత సన్నిహితుల ఒత్తిడి కారణంగానే చంద్రబాబు స్పీకర్ పదవిని అయిష్టంగానే ఇచ్చారనే విమర్శలున్నాయి. అయితే చంద్రబాబు కోసం స్పీకర్ హోదాను... నిబంధనలు పక్కన బెట్టి గతంలో ముందెన్నడూలేని ఆరోపణలు, విమర్శలు, వివాదాలకు గురికావాల్సి వచ్చింది. 23 మంది ఫిరాయింపుదారులపై ఎలాంటి చర్య తీసుకోకపోవటం, రోజాపై ఏడాదిపాటు సస్పెన్షన్ వంటివి ఇందుకు ఉదాహరణలు. అన్నింటి మించి ఆ ఐదేళ్లలో టీడీపీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమంలోనూ... అలాగే కేంద్రంపై వ్యతిరేకంగా సాగిన అన్ని పోరాటాల్లో కూడా కోడెల స్పీకర్ పదవిని పక్కన బెట్టి ఓ సాధారణ కార్యకర్తలా పాల్గొన్నారనేది అక్షర సత్యం. అసలు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అందరూ చెబుతున్నారు. ధైర్య సాహసాలు కల్గిన వ్యక్తులు ఆత్మహత్య చేసుకోవటానికి కూడా ఎంతో ధైర్యం ఉండాలని దీని వెనుక బలమైన కారణాలు కూడా ఉంటాయని మానసిక వైద్యులు చెబుతున్నారు. ఏదిఏమైనా కోడెల బలవర్మరణం ప్రత్యర్థులను సైతం ఒక్కసారి కలచివేసిందనే చెప్పాలి. మరణవార్త తెలిసిన వెంటనే ఆగమేఘాలపై ఘటన స్థలానికి వెళ్లిన చంద్రబాబు, లోకేష్ గత నెల రోజుల్లో ఒక్కసారైనా కోడెల వద్దకెళ్లి ధైర్యానిచ్చి ఉంటే మరికొంత కాలం జీవించి ఉండేవారేమోనని సీనియర్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.