ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్‌పై నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 18: ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్‌పై నిషేధం విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు వైద్యులకు పరిహారంగా మూల వేతనాన్ని పెంచే యోచనలో ఉంది. డాక్టర్ సుజాతారావు అధ్యక్షతన ఆరోగ్య రంగ సంస్కరణలపై ఏర్పాటైన నిపుణుల కమిటీ బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తుది నివేదికను అందజేసింది. సుమారు వందకు పైగా సిఫార్సులు చేసింది. దీనిపై నిపుణుల కమిటీతో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వ వైద్యులచే ప్రైవేట్ ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ రోగులకు వైద్యం జరిపిస్తే తీవ్రంగా పరిగణించి ఆ ఆస్పత్రిని జాబితా నుంచి తప్పించాలని కమిటీ చేసిన ప్రతిపాదనను సీఎం ఆమోదించారు. ప్రైవేట్ ప్రాక్టీస్ నిషేధం, వేతనాల పెంపుదలకు సంబంధించి సమగ్రమైన ప్రతిపాదనలు తయారు చేయాలని సీఎం సూచించారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఏడాది నవంబర్ 1 నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని 150 ఆస్పత్రుల్లో సూపర్ స్పెషాలిటీ సేవలకు ఆరోగ్యశ్రీ వర్తింప చేయాలనే ప్రతిపాదనకు సీఎం ఆమోదించారు. డిసెంబర్ 21 నుంచి ఆరోగ్య కార్డులు మంజూరు చేయనున్నారు. ఆరోగ్యశ్రీ జాబితాలోకి అదనంగా వ్యాధులు చేర్చారు. వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి కొత్త ప్రతిపాదనలతో ఆరోగ్యశ్రీ పైలెట్ ప్రాజెక్ట్‌ను ప్రభుత్వం అమలు చేయనుంది. రెండు వేల వ్యాధులను ఆరోగ్యశ్రీలోకి తీసుకువస్తూ పశ్చిమ గోదావరి జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ అమలు చేయనుంది. మిగిలిన జిల్లాల్లో 12 వందల వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చి పైలెట్ ప్రాజెక్ట్‌గా అమలు చేస్తారు.
వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి జిల్లాల వారీగా వెయ్యి రుపాయల ఖర్చు దాటిన
వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో లోటుపాట్లను గుర్తించి పూర్తి స్థాయి అమలుకు ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. శస్త్ర చికిత్స చేయించుకున్న వారికి కోలుకునేంత వరకు విశ్రాంతి సమయంలో నెలకు రూ. 5వేల చొప్పు ఆర్థిక సహాయం అందించాలని సీఎం వెల్లడించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇస్తున్న పింఛన్‌ను విస్తరించే విషయమై సమావేశంలో చర్చించారు. తీవ్రమైన కిడ్నీ వ్యాధితో బాధపడే వారికి నెలకు రూ. 10వేల పింఛన్‌ను ఇప్పటికే ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇతర దీర్ఘకాలిక వ్యాధులను ఒకే కేటగిరి కిందకు తీసుకువచ్చి వారికి నెలకు రూ. 5వేల ఆర్థిక సాయాన్ని అందించాలని సీఎం ఆదేశించారు. దీనిపై మార్గదర్శకాలు రూపొందించాలన్నారు. కొత్తగా వైద్యుల పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలన్నారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు రావాలని ఆకాంక్షించారు. ఇంజనీరింగ్ అయినా, మెడిసిన్ అయినా అనుభవం కచ్చితంగా ఉండాలని స్పష్టం చేశారు. ఏ వృత్తి విద్యా కోర్సు అయినా చివరి ఏడాది ప్రాక్టికల్‌గా అనుభవం ఉండాలన్నారు. అప్రెంటిస్ అనేది పాఠ్య ప్రణాళికలో ఒక భాగం కావాలన్నారు. ప్రస్తుత విద్యా వ్యవస్థలో ఈ లోపాన్ని గుర్తించామని తెలిపారు. చదువుకున్న అంశాన్ని ఏ విధంగా అమలులో పెట్టాలనేది పాఠ్య ప్రణాళికల్లో పొందుపరచాలని సూచించారు. దీనిపై సరైన మార్గదర్శకాలు రూపొందించాలని నిపుణుల కమిటీని ఆదేశించారు.
ప్రభుత్వ ఆస్పత్రుల దిశ, దశ మారుస్తాం
ప్రభుత్వాసుపత్రులలో సిబ్బంది కొరత లేకుండా సదుపాయాలు కల్పించ గలిగితేనే వ్యవస్థ మనుగడ సాధ్యమవుతుందని సీఎం జగన్ అభిప్రాయ పడ్డారు. రోగులు ఆస్పత్రికి రాగానే వారికి నమ్మకం కలిగించేలా వ్యవస్థలో మార్పులు రావాలన్నారు. బెడ్‌లు, దిండ్లు, బెడ్‌షీట్లు, టాయిలెట్లు, ఫ్లోరింగ్, గోడలు వీటన్నింటినీ కూడా ఆధునీకరించాలని నిర్దేశించారు. అవసరమైన చోట ఏసీలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ మార్పులు చేయగలిగితేనే ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల దృక్పథం మారుతుందన్నారు. మెడికల్ కళాశాలల తరహాలో నర్సింగ్ కళాశాలలపైనా పర్యవేక్షణ ఉండాలన్నారు. నర్సింగ్ విద్యను పటిష్టం చేయాలన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో తప్పనిసరిగా నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆశా వర్కర్లకు శిక్షణ ఇవ్వాలని, దీని కోసం పాఠ్య ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. 108, 104 సేవల్లో వినియోగిస్తున్న వాహనాల నిర్వహణకు సమర్థవంతమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలన్నారు.
నాడు- నేడుపై సమీక్ష
గతంలో ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరు.. భవిష్యత్‌లో చేపట్టనున్న సంస్కరణలపై ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. సదుపాయాలు కల్పించటంతో పాటు వాటి నిర్వహణపై సరైన విధానాలను అవలంబించాల్సిన అవసరం ఉందన్నారు. పెస్ట్ కంట్రోల్, శానిటేషన్, స్టోరేజ్ సిస్టంలపై ఉత్తమ విధానాలను అనుసరించాలని సీఎం ఆదేశించారు. నిర్వహణ కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. గత ప్రభుత్వంలో కుదుర్చుకున్న ఒప్పందాల్లో లోపాలను కమిటీ బహిర్గతం చేసింది. వీటిపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలు కలిగిన మందులనే కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఆరోగ్యశ్రీకి బిల్లులు చెల్లించకుండా గత ప్రభుత్వం తాత్సారం చేసిందనే విషయమై సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. మొత్తం వెయ్యి కోట్ల రుపాల మేర పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు లెక్కలు తేల్చారు. నెట్ వర్క్ ఆస్పత్రులలో ప్రమాణాలపై తనిఖీలు చేసే అంశంపై సీఎం చర్చించారు.

*చిత్రం... ఆరోగ్య రంగ సంస్కరణలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నివేదిక అందజేస్తున్న డాక్టర్ సుజాతారావు కమిటీ