ఆంధ్రప్రదేశ్‌

ఆరోగ్య రంగ సంస్కరణలకు 100కు పైగా సిఫార్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి : ఆరోగ్య రంగ సంస్కరణలకు సంబంధించి 100కు పైగా సిఫార్సులు చేసినట్లు నిపుణుల కమిటీ చైర్‌పర్సన్ డాక్టర్ సుజాతారావు తెలిపారు. ఇందులో ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి. ఆరోగ్య రంగంపై ప్రభుత్వ దృక్పథం మారాలని, దీర్ఘకాలిక వ్యాధులపై దృష్టి సారించాల్సి ఉందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రజలు పెద్ద సంఖ్యలో రావటంలేదని, జాతీయ స్థాయితో పోలిస్తే అతి తక్కువ మంది ఆస్పత్రులకు వస్తున్నారని కమిటీ స్పష్టం చేసింది. ఆరోగ్య రంగంలో బడ్జెట్ చాలా వరకు జీతాలకే సరిపోతోందని పెద్ద సంఖ్యలో ఉన్న సిబ్బంది సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించింది. ఆస్పత్రులలో వౌలిక సదుపాయాలు, పరికరాలను అందుబాటులో ఉంచాలని, మందుల కొనుగోలు, వ్యాధి నిర్థారణ పరీక్షలు ప్రజలకు భారంగా మారాయని వివరించింది. ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలో స్పష్టత, బాధ్యత రెండూ లేవని తేల్చి చెప్పింది. ఒకరు చేసే పని మరొకరు చేస్తున్నారని డూప్లికేషన్ అధికంగా ఉందని ఆస్పత్రులలో యంత్ర పరికరాలన్నీ తుప్పుపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.
వ్యాధి నిరోధకతపై దృష్టి సారించాలి
ప్రజల్లో 30 శాతం మంది హృద్రోగ, క్యాన్సర్ వంటి వ్యాధులతో బాధపడుతున్నారు. మూడు దశల్లో ప్రాథమిక వైద్యం అందించాలి. ఒపతి ఐదువేల మందికి ఒక సబ్ సెంటర్ ఏర్పాటు చేయాలి. ప్రతి 30 వేల మంది జనాభాకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నెలకొల్పాలని, ప్రతి వెయ్యి మంది జనాభాకు విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. చిన్న సమస్యలకు అక్కడే చికిత్స నిర్వహించాలని సూచించింది. రాష్ట్రంలో 18 ఏళ్లలోపు ఉన్న వారు కోటి మంది ఉన్నారు. వారి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, యూత్ క్లబ్‌ల తరహాలో క్లబ్‌లను ఏర్పాటు చేసి ఆరోగ్యంపైన అవగాహన కల్పించాలని ప్రభుత్వాన్ని కోరింది.
సబ్ సెంటర్లలో కరవైన సదుపాయాలు
సబ్ సెంటర్లలో సదుపాయాలు కరవయ్యాయని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది సంఖ్యను 9 నుంచి 13కు పెంచాలని ప్రతి పీహెచ్‌సీలో ముగ్గురు వైద్యులు ఉండాలని ఒక కౌనె్సలర్ లేదా సోషల్ వర్కర్‌ను నియమించాలని ప్రతిపాదనలు చేసింది. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి వైద్యం కొసాగించేలా చూడాల్సిన బాధ్యతను వీరికి అప్పగించాలని, ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 24 గంటలు పనిచేసేలా జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు రెండ్ బెడ్‌లు, ఐసీయు సదుపాయం కల్పించాలని సూచించింది. ప్రతి లక్ష మంది జనాభాకు కమ్యూనిటీ హాస్పటల్ కచ్చితంగా ఫ్యామిలీ మెడిసిన్‌లో ఎండీ చేసిన వారి పర్యవేక్షణలో ఏర్పాటు చేయాలని సామాజిక శస్త్ర చికిత్సల నిర్వహణకు సదుపాయాలు కల్పించాల్సి ఉందని పేర్కొంది.
ఆస్తమాలజీ..ఈఎన్‌టీ కేర్ స్పెషలిస్టులను నియమించి అన్ని మెడికల్ కళాశాలల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని, టీచింగ్, నాన్ టీచింగ్ కేటగిరిలను వేరు చేయాలని ప్రతిపాదనలు చేసింది. ఏడాదికి రెండు వారాల పాటు హెచ్‌ఆర్‌లో శిక్షణ ఇవ్వాలని ఖాళీలను భర్తీ చేయాలని సూచించింది. నర్సింగ్ డైరెక్టరేట్‌ను ఏర్పాటుచేసి కళాశాలల సంఖ్య పెంచాలని కోరింది. నర్స్ ప్రాక్టీషనర్స్‌కు ప్రత్యేక క్యాడర్ ఏర్పాటు చేయాలి.. నర్సింగ్ విద్యకు దేశ, విదేశాల్లో డిమాండ్ ఉంది.. ప్రభుత్వాస్పత్రులలో సదుపాయాలను పెంచాలని వివరించింది. జిల్లా ఆస్పత్రుల స్థాయిని 500 పడకలకు, బోధనాస్పత్రులలో రెండువేల పడకలుగా విస్తృతం చేసి 30 మహిళా ఆరోగ్య కేంద్రాలను 500 పడకలతో ఏర్పాటు చేయాలని ప్రసవాల కోసం, మహిళల ఆరోగ్యం కోసం ఈ కేంద్రాలను వినియోగించుకోవచ్చని సూచించింది. కనీసం 150 మంది డ్రగ్ ఇన్‌స్పెక్టర్లను నియమించాలని ప్రతి మందుల దుకాణంలో అమ్ముతున్న మందులను కంప్యూటరీకరణ చేయాలని ప్రభుత్వాస్పత్రులలో వైద్యం అందుకున్న రోగికి ఏ సేవలు అందిస్తున్నారనే విషయమై ఒక రశీదును అందించాలని, ఎంత విలువైన వైద్యం ఉచితంగా అందిందో రశీదులో పొందుపరచాలని అన్నారు. ప్రస్తుతం 62 శాతం ఖర్చు చేస్తున్నారని 2025 నాటికి 30 శాతానికి తగ్గించాలని ప్రతిపాదనలు చేసింది. సమావేశంలో మంత్రి ఆళ్ల నాని, నిపుణుల కమిటీ సభ్యులు, సీనియర్ ఐఏఎస్‌లు పాల్గొన్నారు.
*చిత్రం...ఆరోగ్యరంగ సంస్కరణలపై నిపుణుల కమిటీ నివేదికపై చర్చిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి