ఆంధ్రప్రదేశ్‌

రైతు భరోసాకు మార్గదర్శకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 18: వచ్చే నెల 15వ తేదీ నుంచి ప్రారంభించనున్న రైతుభరోసా పథకం మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పథకం కింద ఏటా రూ. 12,500 ఆర్థిక సహాయం అర్హత కలిగిన రైతులకు అందుతుంది. పది సెంట్ల నుండి ఐదెకరాల భూమి ఉన్న ప్రతి రైతుకీ ఈ పథకం వర్తిస్తుంది. భూ యజమాని చనిపోతే భార్యకు అందుతుంది. తల్లిదండ్రులు మరణిస్తే వారసుల్లో ఒకరిని అర్హులుగా పరిగణిస్తారు. కౌలురైతు అయితే 50 సెంట్లు లేదా అంత కంటే ఎక్కువ సాగు చేస్తూ అతని పేరున సొంతభూమి లేకపోతే రైతు భరోసా అందుతుంది. భూ యజమాని అంగీకారంతోనే కౌలురైతులకు ఈ పథకం వర్తిస్తుంది. భూ యజమాని ముగ్గురు లేదా నలుగురికి కౌలుకు ఇస్తే భూ యజమానితో పాటు ఆ కౌలు రైతుల్లో ఒకరిని అర్హులుగా ప్రకటిస్తారు. డీ పట్టా భూముల్లో సాగు చేస్తున్న రైతులకు, ఆన్‌లైన్‌లో నమోదు కాని వారికి, ఉద్యానవన, పట్టుపంటలు సాగుచేస్తున్న రైతులకు కూడా ప్రయోజనం కలుగుతుంది. స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో (గుమస్తాలు, నాలుగో తరగతి ఉద్యోగులు, గ్రూప్- డీ ఉద్యోగులు) రైతులుగా ఉంటే ఈ పథకం వర్తింప చేస్తారు. రాజ్యాంగ బద్ధమైన పదవులు చేపట్టిన ఎవరికీ ఈ పథకం వర్తించదు. మాజీ సర్పంచ్, మాజీ జడ్పీటీసీ, మాజీ ఎంపీపీ, మాజీ ఎమ్మెల్యేలు కూడా అర్హులు కారు. ఒకే రేషన్ కార్డులో ఉన్న వ్యక్తుల్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేసి పదవీ విరమణ చేసినట్లయితే ఈ పథకం వర్తించదు. వ్యవసాయ భూములను ఇళ్ల పట్టాలుగా మార్చినా, చేపల చెరువులుగా మార్పుచేసినా కూడా ఈ పథకం కింద అర్హులు కారు. గత ముగింపు సంవత్సరానికి వాణిజ్య వృత్తి పన్నులు, జీఎస్టీ చెల్లించిన వారికి కూడా రైతు భరోసా వర్తించదు. వృత్తిపరమైన సంస్థల కింద నమోదై తమ వృత్తులు కొనసాగిస్తున్న వైద్యులు, ఇంజనీర్లు, న్యాయవాదులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్ట్‌లు ఈ పథకానికి అనర్హులు. నెలకు రూ. 10వేలు లేదా అంతకంటే ఎక్కువ పింఛన్ పొందుతున్న వారు అనర్హులు. భూమి.. భూ యజమాని (తండ్రి లేదా తల్లి) పేరు ఉంటే వారిలో ఎవరైనా బతికి ఉంటే ప్రస్తుతం భూమి సాగుచేస్తున్న వారసులను కూడా ఈ పథకం నుండి మినహాయించారు. బంజరు, బీడు భూములు సాగు చేసుకునే రైతులకు ఈ పథకం వర్తించదు.