ఆంధ్రప్రదేశ్‌

ఇన్ని ఉద్యోగాలు ఓ రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 19: రికార్డు సమయంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామక పరీక్షా యజ్ఞాన్ని పూర్తి చేశారని అధికారులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభినందించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాలకు సంబంధించి నిర్వహించిన పరీక్షల ఫలితాలను గురువారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏక కాలంలో ఓకేసారి ఇంతమందికి ఉద్యోగాలు ఇవ్వడం రికార్డు అని వ్యాఖ్యానించారు. ఎన్నికల హామీలో చెప్పినట్లుగా ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఒకే నోటిఫికేషన్ ద్వారా 1.26 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించడం చరిత్రలోనే తొలిసారని వ్యాఖ్యానించారు. పరీక్షల్లో విజయం సాధించిన వారందరికీ అభినందనలు తెలిపారు. వీరికి మంచి శిక్షణ ఇస్తామని, ప్రజా సేవలో మమేకం కావాలని పిలుపునిచ్చారు. అవినీతికి దూరంగా, నిస్పక్షపాతంగా పరీక్షలు నిర్వహించిన అధికారులను అభినందనలు తెలిపారు. అంకిత భావంతో పరీక్షలు నిర్వహించడంలో మంచి పనితీరు కనబరిచారన్నారు. అక్టోబర్ 2 నుంచి గ్రామ సచివాలయాలు అందుబాటులోకి వస్తాయన్నారు. పరిపాలనలో విప్లవాత్మక మార్పులు సచివాలయాల ద్వారా వస్తాయన్నారు. వర్గాలకు, ప్రాంతాలకు, రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు ప్రజల ముంగిటికే సచివాలయాలు, వలంటీర్ల ద్వారా అందుతాయన్నారు.
1.98 లక్షల మంది ఉత్తీర్ణత
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్షల్లో మొత్తం 1.98 లక్షల మంది ఉత్తీర్ణత సాధించారు. 1,26,728 ఉద్యోగాలకు సంబంధించి 21.69 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షకు 19.5 లక్షల మంది హాజరయ్యారు. వీరిలో 1,98,164 మంది ఉత్తీర్ణత సాధించారు. 19 రకాల పోస్టుల భర్తీకి 14 రకాల పరీక్షలను ఈ నెల 1 నుంచి 9
వరకూ నిర్వహించారు. 10 రోజుల్లో ఫలితాలు వెల్లడించడం విశేషం. 19.5 లక్షల మంది ఓఏమ్మార్ షీట్లను రికార్డు సమయంలో ఈనెల 3 నుంచి 9 వరకూ స్కానింగ్ పూర్తి చేశారు. స్కానింగ్ పూర్తి అయ్యాక ర్యాండమ్ విధానంలో ఫలితాలను నిపుణులతో సరిచూశారు. ఎటువంటి తప్పులు దొర్లలేదని నిర్థారించాక ఫలితాలు విడుదలకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కనీసార్హత మార్కులను ఓసీలకు 40 శాతం, బీసీలకు 35 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 30 శాతంగా నిర్ణయించారు. పరీక్షకు హాజరైన వారిలో ఓపెన్ కేటగిరిలో 25,583, బీసీ కేటగిరిలో 1,00,494, ఎస్సీ కేటగిరిలో 63,629, ఎస్టీ కేటగిరిలో 9548 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణులైన వారిలో పురుషులు 1,31,327 మంది కాగా, మహిళలు 66,835 మంది.
14 పరీక్షల్లో ఓసీ కేటగిరిలో అత్యధికంగా 122.5 మార్కులు, బీసీ కేటగిరిలో 122.5, ఎస్సీ కేటగిరిలో 114, ఎస్టీ కేటగిరిలో 108 మార్కులు సాధించారు. మహిళా అభ్యర్థుల్లో అత్యధికంగా సాధించిన మార్కులు 112.5 కాగా, పురుష అభ్యర్థుల్లో 122.5 మార్కులు సాధించారు. ఇన్‌సర్వీస్ అభ్యర్థులకు 10 శాతం వెయిటేజ్ మార్కులు విడిగా కలుపుతారు. ఫలితాలను గ్రామ సచివాలయ, ఆర్టీజీఎస్ వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంచారు. హాల్ టికెట్, పుట్టిన తేదీ ఆధారంగా ఫలితాలను తెలుసుకోవచ్చు. ఉత్తీర్ణులైన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్ట్ఫికెట్లను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. తరువాత జిల్లా యంత్రాంగం తెలియచేసిన తేదీల్లో సరిఫికెట్లను తనిఖీ చేయించుకోవాలి.
వెరిఫికేషన్ షెడ్యూల్ ఇదే
సర్ట్ఫికెట్ల పరిశీలన, నియామక ఉత్తర్వుల జారీ తదితర అంశాలపై షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
వెబ్‌సైట్‌లోకి సర్ట్ఫికెట్ల ఆప్‌లోడింగ్ సెప్టెంబర్ 21 నుంచి 22 వరకూ, 23 నుంచి 25 వరకూ సర్ట్ఫికెట్ల పరిశీలన జరుపుతారు. నియామక ఉత్తర్వులు 27న జారీ చేస్తారు. అవగాహనా కార్యక్రమాన్ని అక్టోబర్ 1, 2 తేదీల్లో నిర్వహిస్తారు. 2 నుంచి గ్రామ, వార్డు సచివాలయాలు పని చేయడం ప్రారంభిస్తాయి.
*చిత్రం...సచివాలయ నియామక రాత పరీక్షల ఫలితాలు విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు