ఆంధ్రప్రదేశ్‌

ఏప్రిల్ నుంచి నాణ్యమైన బియ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 19: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఏప్రిల్ 1 నుంచి నాణ్యమైన బియ్యం సరఫరాకు చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. పౌరసరఫరాల శాఖపై గురువారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు తినగలిగే నాణ్యమైన బియ్యం సేకరించేందుకు ఇప్పటినుంచే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. రేషన్ బియ్యం సరఫరా చేస్తున్న సంచులను రీసైక్లింగ్ కోసం తిరిగి ఇచ్చేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. డిసెంబర్‌లో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు. శ్రీకాకుళం జిల్లాల్లో అమలు జరుగుతున్న నాణ్యమైన బియ్యం పంపిణీపై ఆరా తీశారు. డిసెంబర్ 1 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీకి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో మంత్రి కొడాలి నాని, పౌరసరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం...పౌరసరఫరాల శాఖపై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి