ఆంధ్రప్రదేశ్‌

ఒక్కటీ దక్కలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం : తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరుమందం వద్ద ఆదివారం గోదావరిలో మునిగిపోయిన టూరిజం బోటులో గల్లంతైన వారిలో 13మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. గురువారం జరిపిన గాలింపు చర్యల్లో ఒక్క మృతదేహం కూడా లభ్యంకాలేదు. ఇప్పటికే ప్రమాదం జరిగి ఐదు రోజులు కావడంతో ఆచూకీ తెలియని వారి బంధువుల్లో అసహనం పెరిగిపోతోంది. తమ వారిని కడసారి చూసుకోవాలనే తపనతో కళ్లు కాయలు కాచేలా రాజమహేంద్రవరం
ప్రభుత్వాసుపత్రి వద్ద ఎదురుచూస్తున్నారు. గత ఐదు రోజులుగా ఏడ్చి ఏడ్చి, వారి కళ్లలో కన్నీరు సైతం ఇంకిపోయింది. దూరప్రాంతాల నుండి వచ్చిన వారు అనాథల్లా తమ వారి ఆచూకీ కోసం ఆసుపత్రి వద్దే విషణ్ణవదనాలతో తిరుగాడుతున్నారు. కాగా ప్రమాదం సంభవించిన ఐదు రోజుల తర్వాత ప్రమాద సమయంలో బోటులో ఉన్న వారి సంఖ్యపై సందేహాలు చెలరేగుతున్నాయి. ప్రమాద సమయంలో బోటులో 73మంది ఉన్నారని (64మంది పర్యాటకులు, ఇద్దరు డాన్సర్లు సహా తొమ్మిది మంది బోటు సిబ్బంది) అధికారికంగా ప్రకటించారు. సురక్షితంగా 26మంది బయటపడ్డారని, ప్రమాదం జరిగిన రోజే ఎనిమిది మృతదేహాలు బయటపడ్డాయని ప్రకటించి, 30మంది గల్లంతయ్యారని నిర్ధారించారు. ఆ మేరకు గాలింపు చర్యలు జరుపుతున్నారు. మంగళ బుధవారాల్లో 26 మృతదేహాలు లభించగా, మరో 13మంది ఆచూకీ తెలియాలని భావిస్తున్నారు. అయితే ప్రమాద సమయంలో బోటులో ఉన్న వారి సంఖ్య 73 కంటే ఎక్కువ ఉంటుందనే కొత్తవాదన తెరపైకి వచ్చింది. అధికారిక లెక్కల ప్రకారం విశాఖ జిల్లాకు చెందిన నలుగురి ఆచూకీ తెలియాల్సివుంది. హైదరాబాద్‌కు చెందిన వారు ఇద్దరు, వరంగల్‌కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి జాడ తెలియాల్సివుంది. అలాగే తెలంగాణ రాష్ట్రం మంచిర్యాలకు చెందిన ట్రాన్స్‌కో ఏఈ రమ్యశ్రీ, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన చెట్లపల్లి గంగాధర్ ఆచూకీ తెలియాల్సివుంది. వీరుకాక మరో ఇద్దరు బోటు సిబ్బంది జాడ తెలియాల్సివుంది. అయితే ప్రమాదం నుండి బయటపడిన వారి కథనాల ప్రకారం బోటులో ఉన్న వారి సంఖ్య ఇంకా ఎక్కువనే తెలుస్తోంది. దీనికి తోడు మాజీ ఎంపీ హర్షకుమార్ సైతం బోటులో ఉన్న వారి సంఖ్యపై సంచలన ఆరోపణలు చేయడం గమనార్హం.
కాగా ఇప్పటి వరకు లభించిన మృతదేహాల్లో బుధవారం వరకు గుర్తించని ఒక మృతదేహం డీఎన్‌ఏ పరీక్ష అనంతరం హైదరాబాద్‌కు చెందిన యువకుడిదిగా గుర్తించారు. దీనితో దొరికిన మృతదేహాలన్నీ గుర్తించినట్టయ్యింది. ఐదు రోజులు అయిన నేపథ్యంలో మృతదేహాలు సముద్రం సమీపం వరకు ప్రవాహంలో కొట్టుకు పోవచ్చని అంచనా వేస్తున్నారు. హెలీకాప్టర్ల ద్వారా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోసు, మంత్రులు కురసాల కన్నబాబు, పినిపే విశ్వరూప్, ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, నాగులాపల్లి ధనలక్ష్మి, జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి, జిల్లా ఎస్పీ అస్మీ, జాయింట్ కలెక్టర్ లక్ష్మీశ, ఐటీడీఏ పీవో నిషాంత్‌కుమార్, రంపచోడవరం ఏఎస్పీ వకుల్ జిందాల్ తదితరులు గాలింపు, వెలికితీత తదితరాలను పర్యవేక్షిస్తున్నారు.
*చిత్రం...ప్రమాదస్థలిలో సమాచారం కోసం చేసిన ఏర్పాట్లు