ఆంధ్రప్రదేశ్‌

నేర సమీక్షా సమావేశాల్లో భాగస్వామ్యం కల్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 19: నేరాల నియంత్రణలో భాగంగా నిర్వహించే రాష్ట్ర స్థాయి నేర సమీక్షా సమావేశాలలో మహిళా కమిషన్‌కి కూడా భాగస్వామ్యం కల్పించాలని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ కోరారు. అలాగే ప్రతి నెలా జిల్లాల వారీగా వచ్చే నేరాల నివేదికలను కూడా కమిషన్‌కు అందజేయాలని విజ్ఞప్తిచేశారు. గురువారం డీజీపీ సవాంగ్‌ను ఆయన కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ కమిషన్ సభ్యులతో కలిసి మహిళలపై జరుగుతున్న నేరాలకు తీసుకోవాల్సిన చర్యపై చర్చించారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ ముఖ్యంగా పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ జరిగే సమయంలో వైవాహిక జీవితానికి సంబంధించి సమస్యలపై లోతైన పరిశీలన జరపాలని, తద్వారా ఎన్నారైల వివాహాలకు సంబంధించిన ఫిర్యాదులను అరికట్టే అవకాశం ఉంటుందని సూచించారు. మహిళలపై సైబర్ నేరాలను అరికట్టడంలో భాగంగా కళాశాల విద్యార్థినులకు అవగాహన కల్పించాలని కోరారు. కమిషన్ విజ్ఞప్తి మేరకు స్పందించిన డీజీపీ సవాంగ్ మహిళా కమిషన్, పోలీసు శాఖల సంయుక్త ఆధ్వర్యంలో త్వరలోనే సాంకేతిక నిపుణులతో విజయవాడలో ఒక సమావేశం నిర్వహించాలని అభిప్రాయపడ్డారు.
*చిత్రం...డీజీపీ సవాంగ్‌తో మాట్లాడుతున్న మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ