ఆంధ్రప్రదేశ్‌

ఉన్నత, పాఠశాల విద్య రెగ్యులేటరీ కమిషన్ల చైర్మన్‌ల నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 19: రాష్ట్ర ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్‌గా ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి వీ. ఈశ్వరయ్యను ప్రభుత్వం నియమించింది. ఏపీ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్‌పర్సన్‌గా హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్.కాంతారావును నియమించింది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిఫారసు మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు గురువారం జారీ చేసిన ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. వై.్భనుప్రకాష్‌ను ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా నియమించింది.
ప్రతిభా రాణికి అంతర్-క్యాడర్ బదిలీ
తూర్పు గోదావరి జిల్లాలో శిక్షణలో ఉన్న ఐఏఎస్ అధికారిణి ప్రతిభా రాణి అంతర్-క్యాడర్ బదిలీకి రాష్ట్ర ప్రభుత్వం గురువారం అనుమతి ఇచ్చింది. తనకు బీహార్‌కు చెందిన ఐపీఎస్ అధికారి స్వర్ణ్ ప్రభాత్‌తో వివాహం జరిగిందని, దీంతో తనకు బీహార్‌కు అంతర్-క్యాడర్ బదిలీ చేయాలన్న ఆమె వినతిని ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
జలవనరుల శాఖలో భారీగా బదిలీలు
రాష్ట్ర జలవనరుల శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను భారీగా బదిలీలు, నియామకాలు చేస్తూ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 105 మందికి సంబంధించి కొంతమందిని బదిలీ, కొంతమందిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.