ఆంధ్రప్రదేశ్‌

అర్హులైన డ్రైవర్లకు రూ.10 వేల సాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 20: అర్హులైన ఆటో, టాక్సీ డ్రైవర్లకు ప్రభుత్వం ఇచ్చే రూ.10 వేల ఆర్థిక సాయం కుటుంబంలోని మేజర్లందరికీ వర్తిస్తుందని రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి ఎంటీ కృష్ణబాబు వెల్లడించారు. విశాఖలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒకే ఇంట్లో డ్రైవింగ్ లైసెన్సు కలిగి, సొంత ఆటో లేదా టాక్సీ కలిగిన వారందరికీ ఈ పథకం వర్తిస్తుందన్నారు. భార్య పేరిట వాహనం ఉండి, భర్త సొంతంగా అదే ఆటో లేదా టాక్సీ నడుపుతుంటే వారికి కూడా పథకం వర్తిస్తుందన్నారు. కుటుంబంలో తండ్రి, ఒకరు లేదా ఇద్దరు బిడ్డలు సొంత ఆటో లేదా టాక్సీ కలిగి వారే డ్రైవర్లుగా ఉపాధి పొందుతుంటే వారికి కూడా వర్తిస్తుందన్నారు. భార్య, భర్తల్లో మాత్రం ఒకరికే దీన్ని వర్తింపచేస్తున్నట్టు తెలిపారు.
ఆర్థిక సాయం కోసం దరఖాస్తులు ఈ నెల 14 నుంచి స్వీకరిస్తున్నామని, ఈ నెల 25 వరకూ గడువు ఉందన్నారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అర్హులు డ్రైవింగ్ లైసెన్స్, తెల్ల రేషన్ కార్డు, ఆధార్, బ్యాంకు పాస్ పుస్తకం జెరాక్స్, వాహన రిజిస్ట్రేషన్ సర్ట్ఫికెట్, కుల నిర్థారణ సర్ట్ఫికెట్ అందజేయాల్సి ఉంటుందన్నారు. రాష్టవ్య్రాప్తంగా ఇప్పటి వరకూ 1.26 లక్షల దరఖాస్తులు అందాయని తెలిపారు. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 11,325 దరఖాస్తులు, అత్యల్పంగా అనంతపురం 3,361 దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు. గడువులోగా వచ్చే దరఖాస్తులు పరిశీలించి ఎంపికైన అర్హులకు ఆక్టోబర్ 4న వారి ఖాతాలకే నగదు జమ చేయనున్నట్టు తెలిపారు.