ఆంధ్రప్రదేశ్‌

ప్రతి పేదవానికి సంక్షేమ ఫలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 20: సమాజంలోని ప్రతి పేదవానికి సంక్షేమ ఫలాలు అందాలనేదే ప్రభుత్వ లక్ష్యమని స్ర్తి, శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు. శుక్రవారం సచివాలయంలోని 5వ బ్లాక్ సమావేశ మందిరంలో ప్రభుత్వ, ప్రైవేట్, స్వచ్ఛంద సేవా సంస్థలతో సమావేశం నిర్వహించారు. జాతి పున ర్నిర్మాణంలో సేవ ఒక భాగం కావాలని, సేవా భావాన్ని ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలని మంత్రి పిలుపు ఇచ్చారు. ప్రస్తుత సమాజంలో సేవా భావం ప్రతి ఒక్కరిలో పెరిగిందన్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు, వృద్ధాశ్రమాలు, వికలాంగుల నిలయాలు, అనాథ శరణాలయాలు, విద్యా సంస్థలు, హాస్టళ్లు, గ్రంథాలయాలు, నైపుణ్య శిక్షణా కేంద్రాలు, కోచింగ్ సెంటర్లు సమాజాభివృద్ధికి దోహద పడుతున్నాయని వివరించారు. దుఃఖితులు, పీడితులు, అణగారిన వర్గాల కోసం ప్రతి స్వచ్ఛంద సంస్థ పనిచేయాలని సూచించారు. సమాజంలో దివ్యాంగులు, మానసిక వికలాంగులు, చెవిటి, మూగ, బధిరులు, చలన సంబంధమైన లోపం కలిగిన వారు అనేక మంది ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిలో ఆత్మన్యూనతా భావం లేకుండా ఆదరించాలని ఎన్జీవోలకు దిశానిర్దేశం చేశారు. వారిలో ఆత్మవిశ్వాసం పెంచేలా కృషి చేయాలన్నారు. అంగ వైకల్యాలను జయించి జీవితంలో ముందుకు సాగేలా సహకరించాలన్నారు. సేవ పొందే వారు సైతం సేవ చేసే విధంగా మార్పు రావాలని ఆ దిశగా అందరిలో ప్రేరణ కల్పించాలని అభిలషించారు. రక్తసంబంధాలకు దూరమైన వారిని స్వచ్ఛంద సంస్థలు చేరదీయటం అభినందించ దగిన విషయమన్నారు. అయితే సామాజిక బాధ్యత పేరుతో కొన్ని స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న తప్పుల వల్ల మిగతా సంస్థలపై నమ్మకం సన్నగిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సంపాదించే ధనంలో కొంత సమాజ సేవకు వినియోగించాలని కోరారు. సమాజంలో ఏదో రూపంలో ప్రజలు సేవలందించటం హర్షణీయమన్నారు. కష్టాలను దూరం చేసేందుకు సేవా కార్యక్రమాలు నిర్వహించి వారికి తోడు నీడగా ఆపన్న హస్తం అందించే విధంగా స్వచ్ఛంద సంస్థలు సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయని ప్రశంసించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించే విధంగా కృషి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారని మంత్రి వనిత గుర్తుచేశారు. సేవకు ముందుకు వచ్చే స్వచ్ఛంద సంస్థలకు అవసరమైతే నిధులు అందజేస్తామని వెల్లడించారు. సామాజిక బాధ్యత పేరుతో నిధులు పక్కదోవ పట్టించినా, దుర్వినియోగం చేసినా అలాంటి సంస్థలు, బాధ్యులైన వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వమిచ్చే సహాయంతో మంచి పేరు తీసుకు రావాలన్నారు. కొన్ని సంస్థలు మద్యపాన నిషేధం అమలుకు కృషి చేయటం అభినందనీయమన్నారు. స్ర్తి, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి కే దమయంతి మాట్లాడుతూ మంత్రి ఆదేశాల ప్రకారం రాష్ట్రంలోని స్వచ్ఛంద సంస్థల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశామన్నారు.
సుమారు 117 స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారని తెలిపారు. రాష్ట్రంలోని పలు స్వచ్ఛంద సంస్థలు మత్తుపానీయాల నియంత్రణ, దురలవాట్లను మాన్పించే దిశగా ప్రజలను జాగృతం చేయాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రతి ఇంటి దరి చేరేలా చూడాలన్నారు. కార్యక్రమంలో వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కిషోర్‌కుమార్, జనరల్ మేనేజర్ రవిప్రకాష్, 13 జిల్లాల శాఖాధికారులు, రాష్ట్రంలోని అన్ని స్వచ్ఛం సేవా సంస్థలు, రాష్ట్రీయ సేవా సమితి ప్రతినిధులు పాల్గొన్నారు.