ఆంధ్రప్రదేశ్‌

అంతర్గత భద్రతకు రాష్ట్రాల మధ్య సమన్వయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 20: కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన డీజీపీలతో కూడిన ‘దక్షిణ ప్రాంతీయ సమన్వయ కమిటీ’ సమావేశం హైదరాబాద్‌లోని కాకతీయ హోటల్‌లో శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో దేశ అంతర్గత భద్రతకు సంబంధించి రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం అందించుకోవడంపై ఈ సమావేశంలో చర్చించారు. నేరాల నివారణ, గుర్తించడం, సైబర్ నేరాల దర్యాప్తుపై ఆందోళనలు, శాంతి భద్రతలు, సైబర్ నేరాలు, మావోయిస్టులు, ఉగ్రవాదం, మాదకద్రవ్యాల రవాణా తదితర అంశాలపై కమిటీ చర్చించింది. రాష్ట్రాల మధ్య నేరస్థుల ప్రొఫైల్స్ డేటాను పంచుకోవడం, సైబర్ క్రైమ్స్, ఐటీ యాక్ట్ దర్యాప్తుకు సంబంధించిన సమస్యలు, డ్రగ్స్ నేరస్థులు, వ్యవస్థీకృత నేరాలు, నేరస్థులకు సంబంధించిన డేటాబేస్‌ను భాగస్వామ్యం , విదేశీ వలసదారుల విషయాలు వంటి అనేక అంశాలపై కమిటీలో చర్చించారు. పోలీసు శాఖలో పలు మార్పులు తీసుకురావడంతో పాటు ఇరు రాష్ట్రాల మధ్య మెరుగైన సమన్వయం కోసం నోడల్ అధికారి నియామకానికి కమిటీ తీర్మానం చేసింది. దక్షిణా రాష్ట్రాలకు చెందిన డీజీపీలు, ఉన్నతాధికారులతో జరిగిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో తీసుకున్న వివిధ నిర్ణయాల అమలు కోసం చిన్న ఫంక్షనల్ గ్రూపులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మంచి పద్ధతుల భాగస్వామ్యం, రాష్ట్రాల్లో అనుసరించే పోలీసింగ్‌లో చొరవలను తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలు సమర్పించాయి. తెలంగాణ పోలీసు ఐటీ ఇనిషియేటివ్స్ ప్రదర్శన, సీసీటీఎన్‌ఎస్, ఐసీజెఎస్, షీ టీమ్స్, భరోసా వంటి కార్యక్రమాల గురించి సమావేశంలో చర్చించారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల అదుపు, మహిళల భద్రతకు సంబంధించి తెలంగాణ పోలీసులు చేపడుతున్న వివిధ కార్యక్రమాలను ఆయా రాష్ట్రాలకు చెందిన పోలీసు అధికారులు ప్రశంసించారు. కమిటీ సమావేశంలో తీసుకున్న వివిధ నిర్ణయాల అమలుపై సమీక్షకు వచ్చే ఏడాది సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సమావేశానికి హాజరైనందుకు ఇతర రాష్ట్రాల అధికారులందరికీ తెలంగాణ డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
సమావేశంలో రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, రోడ్ భద్రత అథారిటీ చైర్మన్ టీ.కృష్ణ ప్రసాద్, తెలంగాణ అదనపు డైరెక్టర్ జనరల్ అధికారులు జితేందర్, రవి గుప్తా, అంజనీ కుమార్, మహేష్ భగవత్, వీసీ సజ్జనార్‌లతో పాటు ఆంధ్రప్రదేశ్ డీజీపీ డీ. గౌతం సవాంగ్, కర్నాటక డీజీపీ నీలమణి ఎస్.రాజు, కేరళ డీజీపీ లోకనాథ్ బెహెరా, తమిళనాడు డీజీపీ జేకే త్రిపతి తదితరులు పాల్గొన్నారు.