ఆంధ్రప్రదేశ్‌

ఆర్టీజీఎస్ వెబ్‌సైట్‌లో సచివాలయ పరీక్షా ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 20: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సచివాలయ పరీక్షా ఫలితాల కోసం రియల్‌టైం గవర్నెన్స్ సర్వీసెస్ వెబ్‌సైట్‌ను ఫలితాలు వెలువడిన 24 గంటల్లో 16 లక్షల 66వేల 513 మంది సందర్శించారని ఆర్టీజీఎస్ సీఈఒ ఎన్ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఉద్యోగుల పరీక్షా ఫలితాలను విడుదల చేశారని గుర్తుచేశారు. శుక్రవారం సచివాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ పంచాయతీరాజ్, ఆర్టీజీఎస్‌ల ద్వారా ఫలితాల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరచి ప్రజల సౌలభ్యం కోసం అందుబాటులో ఉంచామన్నారు. సాంకేతికపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టామన్నారు. ఇందుకోసం ప్రత్యేక సాంకేతిక సిబ్బంది, అధికారుల బృందంతో పర్యవేక్షణ జరిపామన్నారు. 6,64,809 మంది అభ్యర్థులు వారి హాల్‌టికెట్ ద్వారా ఫలితాలు తెలుసుకున్నారని గుర్తించారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు 16 లక్షల 66వేల 513 మంది వెబ్‌సైట్‌ను సందర్శించారని, వారిలో 8 లక్షల 21వేల 910 మంది పరీక్షా ఫలితాలు తెలుసుకున్నారని వివరించారు.