ఆంధ్రప్రదేశ్‌

అథ్లెటిక్స్‌లో సత్తాచాటిన అరకు విద్యార్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 20: గిరిజన విద్యార్థులు క్రీడల్లో రాణించేలా అత్యుత్తమ శిక్షణ ఇస్తున్నట్లు గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్, ఏపీ గురుకులం కార్యదర్శి పి రంజిత్ బాషా అన్నారు. ఇటీవల కర్నాటకలోని ఉడిపిలో జరిగిన సౌత్‌జోన్ జూనియర్ నేషనల్ అథ్లెటిక్స్ మీట్‌లో పతకాలు సాధించిన విశాఖ జిల్లా అరకులోని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకులం విద్యార్థులను ఆయన అభినందించారు. విజయవాడలోని గిరిజన సంక్షేమశాఖ కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో విద్యార్థులను రంజిత్ బాషా సత్కరించారు. గురుకులం విద్యార్థులు జాతీయస్థాయిలో పతకాలు సాధించడం ఆనందంగా ఉందని, భవిష్యత్‌లో విద్యార్థులు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. గిరిజన విద్యార్థులకు అత్యుత్తమ క్రీడా శిక్షణ సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇప్పటికే అరకులో గిరిజన క్రీడా పాఠశాల ఏర్పాటు చేసి మంచి ఫలితాలు సాధిస్తున్నామన్నారు. ప్రతి ఏటా వేసవిలో క్రీడా శిక్షణ శిబిరాలతో గిరిజన విద్యార్థులను క్రీడల్లో తీర్చిదిద్దుతామన్నారు. ముఖ్యంగా అండర్-14 600 మీటర్ల రేస్‌లో శెట్టి లోహిత్, అండర్-14 లాంగ్ జంప్‌లో కె నందకిషోర్, అండర్-16 లాంగ్ జంప్‌లో ఆర్ సాయి శ్రీనివాస్ వెండి పతకాలు సాధించగా, అండర్-14 100 మీటర్ల రేస్‌లో పి పవన్‌కుమార్, అండర్-16 800 మీటర్ల రేసులో బి శ్రీకాంత్ నాయక్, అండర్-16 జావెలిన్ త్రోలో ఎస్ మునినాయక్ నాలుగో స్థానం సాధించగా, అండర్-18 2కె రన్‌లో ఎం దిల్షాన్ ఏడోస్థానంలో నిలిచి ప్రతిభ చాటినట్లు పి రంజిత్ బాషా తెలిపారు. కార్యక్రమంలో ఏపీ గురుకులం సంయుక్త కార్యదర్శి బాలాజీ నాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.