ఆంధ్రప్రదేశ్‌

బలవర్ధక ఆహార పదార్థాలే వాడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 26: బలవర్థీకరించిన (్ఫర్టిఫైడ్) ఆహార పదార్థాలనే ప్రజలు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో సేఫ్టీనెట్‌లో భాగంగా అడాప్షన్ ఆఫ్ ఫుడ్ ఫోర్ట్ఫికేషన్ అనే అంశంపై గెయిన్ (గ్లోబల్ అలియెన్సు ఫర్ ఇంప్రూవ్డ్ న్యూట్రిషన్), కర్నాటక పబ్లిక్ హెల్త్ ప్రతినిధులతో గురువారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎస్ మాట్లాడుతూ వంట నూనెలు, పాలు, బియ్యం, గోధుమ పిండి, తదితర ఆహార పదార్థాలను ఏ, డీ, ఈ, తదితర విటమిన్లతో బలవర్థీకరించాలని, వాటినే ప్రజలు ఉపయోగించేలా చూడాలని ఆదేశించారు. మెరుగైన ఆరోగ్యానికి ప్రతి ఒక్కరూ బలవర్థీకరించిన ఆహార పదార్థాలనే వాడాల్సిన అవసరం ఉందన్నారు. వంట నూనెలు, పాలు, బియ్యం తదితర ఆహార పదార్థాలను ఈ విధంగా చేసి మార్కెట్లో విక్రయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోని అన్ని సంక్షేమ వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, మధ్యాహ్న భోజన పథకం అమలు చేసే పాఠశాలలు, కళాశాలలు, ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలన్నింటిలో ఈ బలవర్థీకరించిన ఆహార పదార్థాలనే కొనుగోలు చేసి, వినియోగించేలా చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులను ఆదేశించారు. ఈ విధంగా బలవర్థీకరించిన ఆహార పదార్ధాలనే విక్రయించేలా అమ్మకందారులకు, ఉత్పత్తిదారులకు తెలియచేయాలన్నారు. జనవరి 1 నుంచి బలవర్థీకరించిన ఆహార పదార్థాలనే వినియోగించేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్లు దీనిపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే వివిధ డెయిరీల ద్వారా ఈ తరహా పాలు విక్రయిస్తున్నారని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలనన్నారు. ఈ సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి, కర్నాటక హెల్త్ ట్రస్టు, గెయిన్ టీమ్ లీడర్ గురురాజు, మహిళా సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు సిసోడియా, దమయంతి తదితరులు ప్రసంగించారు.