ఆంధ్రప్రదేశ్‌

రజనికి సర్కారు భారీ నజరానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), ఆగస్టు 29: మన దేశం తరపున ఒలింపిక్స్‌లో పాల్గొన్న హాకీ క్రీడాకారిణి రజనికి రాష్ట్ర ప్రభుత్వం నజరానా ప్రకటించింది. రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఆమెకు 25లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. అలాగే గ్రూప్-2 ఉద్యోగం ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. సోమవారం విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో రజనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.25లక్షల చెక్కును అందచేశారు. చెక్కు తీసుకునే సమయంలో తనకు ఇల్లు లేదని సిఎం చంద్రబాబుకు చెప్పడంతో, తిరుపతిలో 1000 గజాల స్థలం కూడా ఇస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఇదిలావుంటే, రజత పతకంతో తిరిగి వచ్చిన సింధును ప్రభుత్వం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరానికి రప్పించి, అక్కడి నుంచి భారీ ఊరేగింపుతో విజయవాడకు తీసుకొచ్చి ఘనంగా సత్కరించగా, తోటి క్రీడాకారిణి రజని పట్ల ప్రభుత్వం అనుసరించిన వైఖరిని మాత్రం క్రీడాకారులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా చిత్తూరులో ఉన్న రజనిని విజయవాడ రావాల్సిందిగా శాప్ చైర్మన్ మోహన్ ఆదివారం రాత్రి ఆహ్వానించారు. అయితే ఆమె ఆర్టీసీ బస్సులో విజయవాడకు చేరుకుంది. విజయవాడలో ఆమెను ఆహ్వానిస్తూ ఒక్క బ్యానర్ కూడా కట్టకపోవడం కూడా గమనార్హం. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని కనీసం ఆమెను సన్మానించనూలేదు. ప్రభుత్వ వైఖరి పట్ల క్రీడాకారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చిత్రం.. రజనికి చెక్కు అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు