ఆంధ్రప్రదేశ్‌

1 నుంచి కొత్త మద్యం పాలసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్రంలో అక్టోబర్ ఒకటో తేదీ నుంచి నూతన మద్యం విధానం అమలుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఎక్సయిజ్ ప్రొహిబిషనరీ శాఖ మంత్రి నారాయణస్వామి అన్నారు. స్థానిక ఎక్సయిజ్ కమిషనర్ కార్యాలయంలో శనివారం మంత్రి విలేఖరులతో మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 450 దుకాణాలను నిర్వహిస్తున్నామన్నారు. 1 నుంచి పూర్తి స్థాయిలో 3,500 మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహిస్తుందన్నారు. ప్రభుత్వ దుకాణాల నిర్వహణ కోసం అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో 3500 మద్య దుకాణాలలో 8033 మంది ఉద్యోగులు, సేల్స్ మేనేజర్‌ల నియామకాలు పూర్తయ్యాయన్నారు. ఎక్కడా అవినీతి జరగకుండా తమ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తారని అన్నారు. ఇదిలా ఉండగా 678 కొత్త ఎక్సయిజ్ కానిస్టేబుళ్ల పోస్టుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. మద్యం వల్ల అనేక కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నందున తామ చేపట్టిన దశల వారీ మద్య నిషేధానికి ప్రతిపక్షాలు, మహిళా సంఘాలు పూర్తిగా సహకరించాలని కోరారు. ఇంత కాలం బెల్ట్‌షాపులు నిర్వహించే వారికి వేరే ఉపాధి కోసం ఆయా జిల్లాల కలెక్టర్‌లతో మాట్లాడామన్నారు. ఎంఆర్‌పీ ధరల విషయంలోనూ, అలాగే బార్ అండ్ రెస్టారెంట్ల సమయాల కుదింపులోనూ త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రస్తుతానికి ప్రభుత్వ దుకాణాలు మాత్రం ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకు నడుస్తాయని అన్నారు. ఏదైన ప్రాంతంలో ఎవరైనా తమకు మద్యం దుకాణం వద్దంటే అక్కడి వాస్తవ పరిస్థితుల ఆధారంగా తగు నిర్ణయం
తీసుకుంటామని ఓ ప్రశ్నకు సమాధానంగా మంత్రి నారాయణస్వామి తెలిపారు. గతంలో 4380 దుకాణాలు ద్వారా ప్రతి దుకాణానికి కనీసం పది బెల్ట్‌షాపులు చొప్పున మొత్తం 47వేల దుకాణాలు నడిచాయన్నారు. వైఎస్ జగన్ సీఎం కావటంతోనే తొలుత బెల్ట్‌షాపులపై ఉక్కుపాదం మోపారన్నారు. అంతేకాకుండా ఈ బెల్ట్‌షాపుల నిర్వాహకులపై 2872 కేసులు నమోదు చేసి 2928 మందిని అరెస్ట్ చేశామన్నారు. అలాగే నాటు సారా తయారీపై చర్యలు తీసుకుని 4788 కేసుల్లో 2834 మందిని అరెస్ట్ చేశామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం రాకుండా 18 సరిహద్దుల్లో మొబైల్ పెట్రోలింగ్ పార్టీల ఏర్పాటుతోపాటు 31 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసామన్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు తమ శాఖ అధికారులు, సిబ్బంది ఎంతో చిత్తశుద్ధితో పని చేస్తున్నారంటూ అభినందించారు. మద్యంపై ఆదాయం కంటే ప్రజల సంక్షేమమే తమకు ముఖ్యమన్నారు. అందులో భాగంగానే ఒక వ్యక్తికి మూడు బాటిళ్లకే పరిమితం చేస్తున్నామన్నారు. కొన్ని చోట్ల అధికం...మరికొన్ని చోట్ల అతి తక్కువ అద్దెలకు అందునా ఉచితంగా ప్రభుత్వ దుకాణాలు ఏర్పాటవుతున్నాయన్న ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ దుకాణాల పరిసరాల్లో ఎలాంటి వ్యాపారాలు జరుగుతున్నాయో కూడా గమనిస్తామన్నారు. గతంలో పర్మిట్ రూమ్‌లు ఉండేవని, అయితే ఇక ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద మద్యం సేవించే అవకాశం ఉండబోదన్నారు. విలేఖర్ల సమావేశంలో రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ ఎంఎం నాయక్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ హరికుమార్, బేవరేజెస్ ఎండీ వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం... విలేఖరులతో మాట్లాడుతున్న ఎక్సయిజ్ మంత్రి నారాయణస్వామి