ఆంధ్రప్రదేశ్‌

శేషాచలం అడవుల్లో అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, మార్చి 25: తిరుమల నుంచి తిరుపతికి వచ్చే మార్గ మధ్యంలో ఉన్న జింకలపార్కు సమీపంలోని శేషాచల అడవుల్లో మంటలు అటవీసంపదను భస్మీపటలం చేస్తున్నాయి. మంటలను ఆర్పేందుకు ఫైరింజన్‌లు అక్కడకు చేరుకున్నప్పటికీ మంటలు చెలరేగుతున్న ప్రాంతానికి వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. దీంతో పైపుల ద్వారా మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది, టిటిడి అటవీశాఖ తమ ధోరణిలో మంటలను అర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రాత్రి 8.30 గంటల వరకు మంటలు అదుపులోకి రాకపోగా మరింతగా పెరుగుతున్నాయి. ఈ మంటలు రెండో ఘాట్ రోడ్డువైపు కూడా వ్యాపించే అవకాశం కనపడుతూ ఉంది. కాగా రాత్రి పది గంటల ప్రాంతంలో కొంతమేర మంటలను అదుపుచేయగలిగారు.