ఆంధ్రప్రదేశ్‌

అన్ని జిల్లాలకు స్వాట్ టీంలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, అక్టోబర్ 3: రాష్ట్రంలోని అన్ని జిల్లాలో ప్రత్యేక శిక్షణ పొందిన స్వాట్ (స్పెషల్ వెపన్ అండ్ టాక్టిక్స్) టీమ్‌లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ తెలిపారు. జిల్లాలో తొలిసారిగా ఏర్పాటు చేసి శిక్షణ పొందిన స్వాట్ టీంను గురువారం నాడు ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ జిల్లా ఎస్‌పి సిద్ధార్థ కౌశల్ వినూత్నంగా ఆలోచించి ప్రకాశం జిల్లాలో నూతనంగా స్వాట్ టీమ్‌ను తయారు చేశారన్నారు. తెలుగురాష్ట్రాల్లో మొట్టమొదటి సారిగా ప్రకాశం జిల్లాలోనే ఈ టీమ్‌లను లాంఛనంగా ప్రారంభించామన్నారు. మన దేశంలో స్వాట్ టీం పంజాబ్‌లోని చండీగఢ్, బెంగళూరు సిటి, ఢిల్లీ రాష్ట్రాలలో మాత్రమే ఉన్నట్లు ఎస్‌పి తెలిపారు. తొలుత అసాంఘిక శక్తులు, టెర్రరిస్టుల నుంచి ప్రజలు, ప్రజాప్రతినిధులను కాపాడటంలో స్వాట్ టీం చేసిన సాహాసోపేతమైన విన్యాసాలను డిజిపి గౌతమ్ సవాంగ్ తిలకించారు. ఉగ్రవాదుల బారి నుండి ప్రజాప్రతినిధులను కాపాడేందుకు స్వాట్ టీం ప్రాణాలకు తెగించి చేసిన విన్యాసం పట్ల డిజిపి మంత్రముగ్ధులయ్యారు. ఉగ్రవాదుల బారి నుండి ప్రజాప్రతినిధులనే కాకుండా వాహనాల హైజాక్, మందుపాతరలు అమర్చటం, వాహనాలకు డిటోనేటర్లను ధైర్య సాహసాలతో స్వాట్ టీం నిర్వీర్యంచేసింది. అనంతరం డిజిపి గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ ప్రకాశం జిల్లా ఎస్‌పి రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా స్వాట్ టీం ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. స్వాట్ టీంకు ప్రత్యేక శిక్షణ ఎందుకు అవసరమన్న విషయంపై డిజిపి మాట్లాడుతూ సాధారణ పోలీసు సిబ్బంది కంటే వీరు ప్రత్యేక నైపుణ్యాలు కలిగి ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్‌పి సిద్ధార్థ కౌశల్, జిల్లాలోని డిఎస్‌పిలు, సిఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వాట్ టీంలో ప్రతిభ కనబరిచిన వారికి రాష్ట్ర డిజిపి డి గౌతమ్ సవాంగ్ చేతుల మీదుగా రివార్డ్సు అండ్ కమాండేషన్ సర్ట్ఫికెట్స్ అందజేశారు.
*చిత్రం...ఒంగోలులో స్వాట్ టీమ్ ఏర్పాటు సభలో ప్రసంగిస్తున్న డీజీపీ సవాంగ్