ఆంధ్రప్రదేశ్‌

కొత్తగా లక్ష ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 5: రాష్ట్రంలో ఉద్యాన పంటలను పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. శనివారం గుంటూరులో ఐటీసీ, రాష్ట్ర ఉద్యానవన శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమగ్ర వ్యవసాయ విస్తరణ ఒప్పందం కార్యక్రమానికి మంత్రి కన్నబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సమగ్ర వ్యవసాయ విస్తరణ ఒప్పందంపై ఉద్యాన శాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి, ఐటీసీ అగ్రి బిజినెస్ సీఈఓ సంజీవ్ రంగరాస్ సంతకాలు చేసి మంత్రి కన్నబాబుకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి కన్నబాబు మాట్లాడుతూ మిరప పంట సాగులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని, దీనిలో 70 శాతం పంట ఒక్క గుంటూరు జిల్లాలోనే సాగవుతోందన్నారు. రాష్ట్రంలో రైతులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంలో రాష్ట్రప్రభుత్వం తన వంతు కృషి చేస్తోందని చెప్పారు. ఇందులో భాగంగానే మిరపపంట సాగు చేసే రైతులకు అన్ని రకాలా సమాచారాన్ని అందించేందుకు ఐటీసీ సహకారంతో డిజిటల్ కాల్ సెంటర్‌ను ప్రారంభించామని పేర్కొన్నారు. ఇటీవల రాష్ట్రప్రభుత్వం ఏర్పాటుచేసిన గ్రామ సచివాలయాల్లో వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక, సెరీ కల్చర్ అసిస్టెంట్లను నియమించినట్లు తెలిపారు. త్వరలోనే గ్రామ సచివాలయాల నుండి రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కన్నబాబు పేర్కొన్నారు.
*చిత్రం... గుంటూరులో శనివారం ఐటీసీ, ఉద్యానవన శాఖ నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కన్నబాబు