ఆంధ్రప్రదేశ్‌

క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, అక్టోబర్ 6: గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించడానికి పతకాల విజేతలకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నగదు ప్రోత్సాహకాలను ప్రకటించారని రాష్ట్ర క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. స్వర్ణ పతకం సాధించిన వారికి రూ.5 లక్షలు, రజత పతకం సాధించిన వారికి రూ.3 లక్షలు, కాంస్య పతకం సాధించిన వారికి రూ.2 లక్షలు ముఖ్యమంత్రి ప్రకటించారన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్స్‌లో గత మూడు రోజులుగా జరిగిన 16వ అంతర జిల్లాల బాలుర, బాలికల అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్-2019 ముగింపు సభ ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా మంత్రి శ్రీనివాసరావు విలేఖర్లతో మాట్లాడారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి కూడా స్వతహాగా క్రీడాకారుడని, హైదరాబాద్ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారన్నారు. అందుకే క్రీడల పట్ల ప్రత్యేక దృష్టిపెట్టారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సాహించాలని, ప్రతిభవుండి ఆర్థికంగా రాణించలేని వారికి గుర్తింపు తీసుకురావాలని, వారిని అన్ని రకాలుగా ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో పుట్టిన ప్రతిభ గల క్రీడాకారులందరినీ ప్రోత్సహిస్తామన్నారు. ప్రభుత్వంతోపాటు ఓఎన్జీసీ వంటి సంస్థలు కూడా క్రీడలను ప్రోత్సహించడంలో భాగస్వామ్యం కావాలన్నారు. రాజమహేంద్రవరంలో క్రికెట్ స్టేడియం, సింథటిక్ ట్రాక్ తదితర సదుపాయాలకు దశలవారీగా వౌలిక సదుపాయాలు కల్పించడానికి కృషిచేస్తామన్నారు.