ఆంధ్రప్రదేశ్‌

బన్ని రక్తసిక్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, అక్టోబర్ 9: దసరా పండుగ రోజు అర్థరాత్రి సంప్రదాయంగా జరిగే దేవరగట్టు గట్టుమల్లయ్య బన్ని ఉత్సవంలో సంప్రదాయం ఆచారం గెలిచింది. సంప్రదాయం ఆచారం ముందు పోలీసుల లాఠీ తలవంచింది. బన్ని కార్యక్రమం రక్తసిక్తంగా ముగిసింది. అధికారికంగా 74 మందికి గాయాలైనాయి. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కర్నూలు జిల్లా హొళగుంద మండలం నెరణికి, నెరణికితండా, కొత్తపేట గ్రామాల ప్రజలు మాలమళ్లేశ్వరస్వామిని దక్కించుకునేందుకు జరిపే కర్రల సమరంలో ఈసారీ భక్తుల తలలు పగిలాయి. దసరాపండుగ రోజు అర్థరాత్రి ఊరేగింపుగా కాగడాల మధ్య గట్టు మల్లయ్య కొండ కింద వద్ద డోళ్లబండ వద్దకు మూడు గ్రామాల ప్రజలు చేరుకున్నారు. పాల బాసలు చేయించిన అనంతరం నెరణికి చెందిన భక్తుడు ఒకరు కలెక్టర్ వీరపాండ్యన్, ఎస్పీ ఫక్కీరప్ప వద్దకు చేరుకుని బన్ని కార్యక్రమానికి అనుమతి తీసుకున్నారు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నా
గట్టు మల్లయ్య కొండలు డూర్ బహూపరాక్.. అంటూ నినాదాలతో మారుమోగాయి. ఒక్కసారిగావేలాది మంది భక్తులు చేతుల్లో కర్రలు, ఆయుధాలు, కాగడాలతో కొండ మీదకు చేరుకున్నారు. అక్కడ పూజలు చేసి ఉత్సవమూర్తులను కర్రల రక్షణ రాక్షస పడక వద్దకు తీసుకువచ్చారు. అక్కడ పెద్దగొరవయ్య తొడలో దబ్బనం గుచ్చుకుని చిప్పలో పిడిడెడు రక్తం తీశాడు. జమ్మిపూజ చేసి ఉత్సవ మూర్తులను మళ్లీ ఆయుధాలు, కర్రలతో కొట్టుకుంటూ కాగడాల వెలుతురులో శివాసానం కట్టవద్దకు వస్తున్న సమయంలో మూడు గ్రామాల ప్రజలు పరస్పరం కర్రలతో కొట్టుకున్నారు. ఈ సమయంలో పలువురి తల, కాళ్లకు గాయాలయ్యాయి. అక్కడే ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో వీరికి ప్రాథమిక చికిత్స అందించారు. కలెక్టర్, ఎస్పీ, 1000 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కర్రలను నిషేధించినా భక్తుల చేతుల్లో ప్రత్యక్ష కావడం గమనార్హం. 74 మందికి గాయలయ్యాయి. తుగ్గలి మండలం ఎర్రగుడికి చెందిన బోయ లింగప్ప, హెబ్బటం గ్రామానికి చెందిన బోయ ఈరప్ప, వీరారెడ్డి, ఉరుకుందకు చెందిన బోయ వీరేష్, ఆలూరుకు చెందిన సిద్దప్ప, నెరణికి చెందిన మల్లప్ప, మడివాళకు తీవ్రగాయాలయ్యాయి. వీరికి ప్రాథమిక చికిత్స అందించి ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇందులో వీరారెడ్డి పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ఆసుపత్రికి తలించారు. పోలీసులు, అధికారులు నిమిత్తమాత్రులుగా మిగిలిపోయారు.
*చిత్రం...బన్ని ఉత్సవం సందర్భంగా దసరా రోజు అర్ధరాత్రి కాగడాల వెలుతురులో కర్రలతో కొట్టుకుంటున్న భక్తులు