ఆంధ్రప్రదేశ్‌

పలువురు ఏఐఎస్ అధికారులు.. డిప్యూటీ కలెక్టర్ల బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : రాష్ట్రంలో ఐదుగురు ఆలిండియా సర్వీస్ అధికారులను, 48 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు (ఎస్జీడీసీ), డిప్యూటీ కలెక్టర్లను (డీసీలకు) బదిలీ, నియామకాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని జిల్లాల జేసీ-2లను, ఆర్డీవోలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న దుర్గగుడి మాజీ ఈవో వీ.కోటేశ్వరమ్మను ప్రణాళికా విభాగం డిప్యూటీ సెక్రటరీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె సామాజిక బాధ్యత అనే అంశాన్ని పర్యవేక్షిస్తారు. ఏపీ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ సీఈవో సంజయ్ గుప్తాను బదిలీ చేస్తూ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్టుకు రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది. పురపాలక శాఖ కమిషనర్ విజయ్‌కుమార్‌కు ప్లానింగ్ సొసైటీ సీఈవోగా అదనపు బాధ్యతలను అప్పగించింది. ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ ఎండీ సుమిత్ కుమార్‌కు పరిశ్రమల శాఖ స్పెషల్ సెక్రటరీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆయన ఇసుక వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. సీసీఎల్‌ఏ స్పెషల్ కమిషనర్ ఎం.హరినారాయణన్‌కు పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ సెక్రటరీగా అదనపు బాధ్యతలను అప్పగించింది. గ్రామ సచివాలయం, గ్రామా వలంటీర్లకు శిక్షణా కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న డీసీ వి.శైలజను అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్ హైవే ఎస్డీసీగా, డీసీ ఎస్వీ లక్ష్మణ మూర్తిని వుడా ఎస్టేట్ అధికారిగా, డీసీ ఎం.్ధనుంజయను ఏపీ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ ప్రమోషన్ (గుంటూరు) సీఈవోగా, డీసీ పి.పద్మావతిని పశ్చిమ గోదావరి జిల్లా మైనారిటీ సంక్షేమ అధిగారిగా, ఎస్జీడీసీ సరళా వందనంను పశ్చిమ గోదావరి జిల్లా డీఆర్వోగా, ఎస్జీడీసీ నాగేశ్వర రావును కర్నూలు డీఆర్వోగా, ఎస్జీడీసీ ఎ.శ్రీరామ చంద్రమూర్తిని చిత్తూరు పౌరసరఫరాల శాఖ విజిలెన్సు ఎస్డీసీగా,
డీసీ నరేంద్ర ప్రసాద్‌ను ప్రకాశం జిల్లా జేసీ-2గా, డీసీ ఎస్.సత్యంను శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ పీఏగా, డీసీ జి.సువర్ణమ్మను హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ భూసేకరణ ఎస్డీసీగా, ఎస్జీడీసీ కె.ఎం.కమల కుమారిని నెల్లూరు జేసీ-2గా,డీసీ బి.ఆర్ అంబేద్కర్‌ను పార్వతీపురం ఐటీడీఏ పీవోగా, వంశధార ప్రాజెక్టు భూసేకరణ ఎస్డీసీ ఆర్.గున్నయ్యను శ్రీకాకుళం జేసీ-2గా, ఎస్డీసీ వి.దేవేందర్ రెడ్డిని టీటీడీ ఎస్టేట్ అధికారిగా, పులిచింతల ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ కె.శ్రీ్ధర్ రెడ్డిని గుంటూరు జేసీ-2గా, మచిలీపట్నం పట్టణాభివృద్ధి సంస్థ ఎస్డీసీ బిఎల్‌ఎన్ రాజకుమారిని బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడీగా, డీసీ వెంకట రమణ ఆకులను ఏటపాక ఆర్డీవోగా, విజయనగరం ఆర్డీవోగా కె.హేమలతను, అమలాపురం ఆర్డీవోగా భవానీ శంకర్‌ను, డీసీ జె.ఉదయ భాస్కర్‌ను కాపు కార్పొరేషన్ జీఎం( డెవలప్‌మెంట్)గా, రంపచోడవరం ఆర్డీవో బి.శ్రీనివాసరావును ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ కార్యదర్శిగా నియమించింది.